ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎక్కడైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ వస్తు ఉంటుంది. ఏదైనా మెగా టోర్నీ అయితే చాలు ఆ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ అయితే సోషల్ మీడియాని ఊపేసింది. లార్డ్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల గురించి కంటే ఎక్కువగా టీం ఇండియా గురించే ట్విట్టర్ లో చర్చ జరిగిందట.
గణాంకాల ప్రకారం 31 మిలియన్ ట్వీట్లు ప్రపంచకప్ గురించి అభిమానులు చేయగా.. 2015 ప్రపంచకప్‌తో పోలిస్తే ఈ ట్వీట్స్ రెండింతలు ఎక్కువ. ప్రపంచకప్ ఫైనల్ లో ఓడిపోయినా కివీస్ జట్టు కంటే… టీం ఇండియా గురించే ఎక్కువ ట్వీట్లు చివరి రోజు వచ్చాయట. ఇక టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ట్విట్టర్ లో ఎక్కువగా చర్చల్లో నిలిచాడు. ధోనీ రిటైర్మెంట్ గురించి ఎక్కువగా ట్వీట్స్ చేసిన నెటిజన్లు, అతని ప్రొఫైల్ గురించి ఎక్కువ వెతికారు.
కెప్టెన్ల విషయానికి వస్తే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి… అగ్ర స్థానంలో ఉన్నాడు. మ్యాచ్‌ల పరంగా చూస్తే.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ గురించి ఎక్కువ ట్వీట్స్ వచ్చాయి.. ఆ తర్వాత ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ గురించి ఎక్కువ చర్చలు జరిగాయి. ఎక్కువ ట్వీట్లు దాని గురించే చేసారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ గురించి ఎక్కువ ట్వీట్లు, భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ (సెమీస్) టాప్-5లో నిలిచాయి.