ఈ ఏడాది రాజకీయాల్లోకి వచ్చిన ఆటగాళ్ళు వీరే, గెలిచింది మాత్రం…

-

క్రీడల్లో అపార ప్రతిభతో రాణించి దేశం తరుపున ప్రాతినిధ్యం వహించి, ఎన్నో విజయాలను, ఎన్నో రికార్డులను తమ ఖాతాలో వేసుకున్న ఆటగాళ్ళు రాజకీయ౦ కూడా చేయడానికి సిద్దమయ్యారు. వీళ్ళు అందరూ భారతీయ జనతా పార్టీ నుంచే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. క్రికెట్ లో ఇతర క్రీడల్లో రాణించి రాజకీయంలోకి అడుగు పెట్టారు. వాళ్ళు ఎవరూ అనేది ఈ స్టోరీలో ఒకసారి చూద్దాం… టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్” అంతర్జాతీయ క్రికెట్ లో ఒక వెలుగు వెలిగి తర్వాత యువ ఆటగాళ్ళు వెలుగులో కనుమరుగు అయిన గంభీర్, ఢిల్లీ నుంచి బిజెపి తరుపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు.

ఢిల్లీ బిజెపిలో ఆయనకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. ఓటర్లను ఆయన విశేషంగా ఆకట్టుకుని ఎంపీగా సిక్స్ కొట్టాడు. ఈ ఏడాది హరియాణా ఎన్నికల్లో సారథిగా, డ్రాగ్‌ఫ్లికర్‌గా భారత హాకీ జట్టుకు సేవలందించిన సందీప్‌ సింగ్‌ ని బిజెపి బరిలోకి దించగా… ఆయన పెహోవా నియోజకవర్గం నుంచి, కాంగ్రెస్‌ అభ్యర్థి మన్‌దీప్‌ సింగ్‌ను 5,314 ఓట్ల తేడాతో ఓడించారు. కేబినేట్ మంత్రి కూడా అయ్యారు.

ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన కుస్తీ వీరుడు యోగేశ్వార్ దత్ హర్యానా ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ ఓటమి పాలయ్యాడు. బరోడా నియోజకవర్గం నుంచి పోటీ చేసి కృష్ణన్ హుడా చేతిలో ఓడిపోయాడు. బాక్సర్ విజేంద్ర సింగ్ కాంగ్రెస్ నుంచి ఢిల్లీ లోక్సభకు పోటి చేసి, బిజెపి సిట్టింగ్ ఎంపీ రమేష్ బిదూరి చేతిలో ఓడిపోయాడు. కుస్తీలో సత్తా చాటిన బాబితా కుమారి ఫోగాట్ కూడా ఈ ఏడాది బిజెపిలో జాయిన్ అయి… దాద్రి నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news