2019 roundup: సంచలన రాజకీయ నిర్ణయాల ఏడాది…!

-

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బిజెపి ఆ తర్వాత కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఏళ్ళ తరబడి సాగుతున్న వివాదాలను దూకుడుగా పరిష్కరించింది.

పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించిన బిజెపి, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మెజారిటి మార్క్ దాటకపోవడం, హర్యానాలో జేజేపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఆశ్చర్యపరిచాయి.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి విషయంలో బిజెపి, శివసేన మధ్య విభేదాలు రావడం, దశాబ్దాలుగా ఉన్న బంధాన్ని శివసేన తెంచుకుని, కాంగ్రెస్, ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మహారాష్ట్రలో అధికారం కోసం శరద్ పవార్ బిజెపికి చూపించిన చుక్కలు ఈ ఏడాది సంచలనమే.

ఆర్టికల్ 370 రద్దు చేయడం ఈ ఏడాది మరో రాజకీయ సంచలనం. ఏళ్ళ తరబడి వివాదాస్పదంగా ఉన్న ఆ ఆర్టికల్ ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ని విభజించడం బిజెపి సర్కార్ ఈ ఏడాది చేసింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాంగ్రెస్ లో బిజెపి చీలిక తెచ్చింది.

రామ మందిర తీర్పు కూడా ఈ ఏడాది మరో హైలెట్… దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను సుప్రీం కోర్ట్ పరిష్కరించింది. వివాదాస్పద స్థలాన్ని రామ మందిరానికి కేటాయిస్తూ సుప్రీం తీర్పు చెప్పింది.

క్యాబ్ బిల్లుని కేంద్రం ఆమోదించడం కూడా ఈ ఏడాది వివాదాస్పదంగా మారింది. ఇప్పటికి దీనిపై ఆందోళనలు ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నాయి.

ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికి నిరసనలతో బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేసేది లేదని కూడా ప్రకటించాయి. ఇలా బిజెపి నిర్ణయాలు అంతర్జాతీయం గా కూడా హైలెట్ గా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news