కలిసొచ్చేకాలం: నిమ్మగడ్డ విషయంలో జగన్ నెక్స్ట్ స్టెప్ ఇదే!

-

కలిసొచ్చే కాలంలో నడిసొచ్చే కొడుకు పుడతాడని సామెత! కాలం కలిసి రావడం మొదలైతే ఆ రేంజ్ లో అద్భుతాలు జరుగుతాయని అంటారు! ఈ క్రమంలో జగన్ కు బాగానే కాలం కలిసివస్తుంది. కొన్ని సందర్భాల్లో కోర్టు మొట్టికాయలు మినహా.. జగన్ కు కాలం బాగా కలిసివస్తుంది. ఇందులో భాగంగానే.. తాను వద్దు మొర్రో అని చెబుతున్న ఎన్నికల కమిషనర్ పై ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది! దీంతో.. ఇప్పుడు కొత్త స్కెచ్ వేస్తోందట అధికార పార్టీ!

వైకాపా నేతలు ఎంత మొత్తుకున్నా.. వారి మాటలను రాజకీయ కోణంలో కూడా చూస్తారు జనం. కావాలనే నిమ్మగడ్డకు.. పసుపు రంగు పూస్తున్నారని అనుకునేవారూ ఉండి ఉంటారు! ఈ క్రమంలో సరిగ్గా ఆయనకు ఆయనే వెళ్లి పసుపురంగు పులుముకున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. ఇదే ఇప్పుడు జగన్ కు కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకుగా మారిందని అంటున్నారు.

వైకాపా నేతలు ఎన్నికల కమిషనర్ పై ఎన్ని విమర్శలు చేసినా.. ఆ విమర్శలకు టీడీపీ నేతలు, వాటి అనుకూల పత్రికలు ప్రతివిమర్శలు చేస్తూవస్తున్నాయి! ఈ క్రమంలో కలిసొచ్చే కాలంలో భాగంగా… వైకాపా నేతలు చేస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తూ.. నిమ్మగడ్డ రమేష్ కుమారే తనకు తాను ప్రజలకు క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది. కాబట్టి… వైకాపా నేతల టార్గెట్ ఆల్ మోస్ట్ పూర్తయినట్లే! కాబట్టి… కరోనా సహకరిస్తే.. నిమ్మగడ్డనే కమిషనర్ గా నియమించి, ఎన్నికలకు వెళ్లడానికి జగన్ సర్కార్ ప్లాన్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానివెనక ఉన్న లాజిక్కులేమిటో ఇప్పుడు చూద్దాం!

సాధారణంగా స్థానిక ఎన్నికల విషయంలో.. అధికార పక్షంపై విమర్శలు గట్టిగా వినిపిస్తుంటాయి. అధికారులను, పోలీసులను తమకు అనుకూలంగా వాడుకున్నారని.. ప్రత్యర్థులకు తాయిలాలు ఇచ్చి ఏకగ్రీవం చేస్తున్నారని.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుంటాయి. ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కమిషనర్ గా పెట్టి స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తే ప్రతిపక్ష టీడీపీ నోరు నొక్కెసినట్లవుతుంది.

ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, అధికారపార్టీ నేతలు అరాచకాలు చేశారని అనలేదు. ఎందుకంటే.. వారు కోరుకున్న వ్యక్తే ఎన్నికల అధికారిగా ఉన్నారు కాబట్టి! ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న వైకాపా అధినాయకత్వం… నిమ్మగడ్డ గురించి ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి… ఇప్పుడు ఆయనను కమిషనర్ గా కుర్చోబెట్టే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుందట.

Read more RELATED
Recommended to you

Latest news