ఫ్యాక్ట్ చెక్: వెంటిలేటర్ సప్పోర్ట్ తో ఆస్పత్రిలో రామ్ దేవ్ బాబా…. ఈ ఫోటోలో నిజమెంత …?

కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక రకాల ఫేక్ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బాబా రాందేవ్ హాస్పిటల్ లో ఉన్నారని సోషల్ మీడియా లో ఈ వార్తలు తెగ చక్కెర్లు కొడుతున్నాయి. వెంటిలేటర్ సహాయం తో ఆస్పత్రి లో ఉన్న ఒక ఫోటో వైరల్ అవుతోంది. ‘ప్రాణాయామం గురించి అంద‌రికీ నేర్పించే రామ్ దేవ్ బాబా నేడు వెంటిలెట‌ర్‌పై ఉన్నాడు.. ఆక్సిజన్ గురించి ప్రజలకు బోధించే బాబా ఇప్పుడు వెంటిలేటర్‌లో ఉన్నాడు.. క‌రోనాకు వ్యాక్సిన్ క‌నిపెట్టామన్న వారి ప‌రిస్థితే ఇలా ఉందంటూ’ అంటూ ఓ పోస్ట్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయితే ఈ పోస్ట్ నిజ‌మైన‌దా కాదా అని తెలుసుకోకుండా షేర్లు చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెక్:

బాబా రాందేవ్ ఆసుపత్రి లో వెంటిలేటర్ సహాయం తో ఉన్నారన్న వార్త లో ఏమాత్రం నిజం కాదు. ఇది 2011లో తీసిన ఫోటో. అవినీతి మరియు నల్లధనానికి వ్యతిరేకంగా తొమ్మిది రోజుల నిరాహార దీక్ష చేసిన తరువాత బాబా రామ్‌దేవ్ డెహ్రాడూన్‌లో ఆసుపత్రి పాలైనప్ప‌టి ఫోటో ఇది. రామ్ దేవ్ బాబా ఆసుపత్రిలో చేరార‌ని,వెంటిలేటర్ మద్దతుతో ఉన్నార‌ని పేర్కొంటూ వ‌స్తున్న‌ తాజా వార్తా కథనాలు నిజ‌మైన‌వి కాదు. ఇలాంటి పోస్ట్ ద్వారా ప్ర‌జ‌ల‌ను తప్పుదారి పట్టిస్తున్నారు.

అయితే ఇది ఇప్పటి వార్త కాదు. వెంటిలేటర్ సహాయం తో బాబా రాందేవ్ ఇప్పుడు లేరు కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలు నమ్మద్దు. ఈ తరహా లో అనేక ఫేక్ వార్తలు వస్తూనే వున్నాయి. బాబా రాందేవ్ తాజాగా ఆస్పత్రి లో అడ్మిట్ అయిన వార్తలు ఏమీ లేవు. కేవలం ఇవి పుకార్లు మాత్రమే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉన్నారు. తాజాగా ఆయన యోగ సెషన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేశారు.