సూపర్ ఫుడ్ గురించి మాట్లాడాఅల్సి వస్తే అందులో ముందు వరుసలో ఉండే ప్రత్యేకత గల ధాన్యం క్వినోవా. ఇది కూడా మిగతా రకాల ధాన్యాల వంటిదే. కానీ దీనిలోని పోషకాలు దీన్ని సూపర్ ఫుడ్ గా చేసాయి. ఐరన్, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండడంతో అనేక అనారోగ్య సమస్యలతో పోరాడి ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ నివారణలో, వయసు పెరిగే లక్షణాలు తగ్గించడానికి ఇది సాయపడుతుంది. ఇంతేకాదు ఎముకలు బలంగా తయారవడానికి క్వినోవా తోడ్పడుతుంది. క్వినోవా ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
ఎముకల వ్యాధి నుండి రక్షించడానికి
ఆస్థియోపోరోసిస్ వ్యాధి ఉన్నవారు క్వినోవాని ఆహారంగా తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం, మాంగనీస్ ఉండడం వల్ల ఎముకలని బలోపేతం చేయడానికి సాయపడతాయి. ముఖ్యంగా వృధ్ధులు దీన్ని ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమం.
బరువు తగ్గడానికి
ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకున్నా వారి డైట్ లో దీన్ని చేర్చవచ్చు. అదీగాక హైడ్రాక్సీడాసోన్ ఉంటుంది. ఇది కేలరీలను కరిగించి బరువు తగ్గిస్తుంది.
రక్తహీనతను నివారించడానికి
రక్త హీనతతో బాధపడేవారు వండిన క్వినోవాని ఆహారంగా తీసుకోవాలి. ఇందులో ఐరన్ ఉంటుంది. అది రక్తహీనతను తగ్గిస్తుంది. ఇంకా రైబోఫ్లేవిన్ ఉంటుంది కాబట్టి రక్తం పుట్టుకువస్తుంది.
గుండె ఆరోగ్యానికి
క్వినోవా చెడు కొవ్వును తగ్గిస్తుంది. దానివల్ల గుండె మీద భారం పడదు. అందువల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
క్యాన్సర్
ఒకానొక అధ్యయనం ప్రకారం క్వినోవాని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగవుతుంది. దానివల్ల మలబద్దకం సమస్య పూర్తిగా తొలగిపోతుంది.