కేటిఆర్ గారూ… ఇంజక్షన్ 30 వేలు… ఫిర్యాదు అందిన వెంటనే…!

కరోనా ఇంజక్షన్ విషయంలో కొన్ని మృగాలు మనుషులమనే విషయాన్ని కూడా మర్చిపోతున్నాయి. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నా సరే ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. ఇంజక్షన్ ల విషయంలో భారీ దోపిడి జరుగుతుంది. తాజాగా మధిరలో రెమిడి సివర్ ఇంజక్షన్ కు రూ.30వేలు వసూలు చేస్తున్నారని కేటీఆర్ కు ఫిర్యాదు వెళ్ళింది.ktr

మధిర లోని కెవీఆర్ జనరల్ హాస్పిటల్ లో కరోనా తో చికిత్స పొందుతున్న తన కుటుంబ సభ్యులకు ఆసుపత్రి లో రెమిడిసీవర్ ఇంజెక్షన్ ఇచ్చి ఒకొక్క ఇంజెక్షన్ కు 30 వేలు వసూలు చేశారని మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో బాధితుడు ఫిర్యాదు చేసాడు. మధిర లోని కె.వి.ఆర్ హాస్పిటల్ పై విచారణకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు విచారణ మొదలుపెట్టారు.