ఫ్యాక్ట్ చెక్: అండమాన్ దీవుల పేరుని అమిత్ షా మార్చాడా..?

-

సోషల్ మీడియాలో తాజాగా ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా అండమాన్ నికోబార్ దీవులుకి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేరు పెట్టారని అండమాన్ నికోబార్ దీవులని నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవులుగా అయన మార్చారని ఆ సోషల్ మీడియా పోస్ట్ లో ఉంది.

కనుక ఇప్పటి నుండి అండమాన్ నికోబార్ దీవులను నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవులని పిలవాలని దానిలో ఉంది. అయితే నిజంగా షా అండమాన్ నికోబార్ దీవుల పేరుని మార్చారా…? దానిని ఇక నుండి సుభాష్ చంద్రబోస్ దీవులు అని అంటారా..? అసలు దీనిలో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ వస్తున్నాయి. వాటిని నేటిజన్లు నిజమని ఫార్వర్డ్ చేయడం, నమ్మడం లాంటివి చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కూడా అబద్ధం ఉందా లేదు అంటే ఇది నిజమా అని దాని గురించి ఇక్కడ క్లారిటీ గా ఉంది.

అండమాన్ నికోబార్ దీవుల పేరుని అమిత్ షా మార్చారా లేదా అనేది చూస్తే.. ఇలా మార్చారు అనే దానికి ఎటువంటి రుజువు లేదు. దీంతో ఇది నిజం కాదని తెలుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 2018 లో రోస్ దీవులని నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవులు అని అన్నారు. ఆ మూడు దేవుని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేరు కింద మార్చారు. అయితే అమిత్ షా మాత్రం మార్చ లేదని పూర్తిగా తెలుస్తోంది. కనుక ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. షా మాత్రం శంకుస్థాపన కి సుభాష్ చంద్ర బోస్ దీవుల వద్దకి వెళ్లారు. కానీ ఆ పేరుని ఆయన మార్చలేదు.

Read more RELATED
Recommended to you

Latest news