ఫ్యాక్ట్ చెక్: ఇందిరా గాంధీ నిజంగా సీ ఫుడ్ తిన్నారా..? వైరల్ అవుతున్న పోస్ట్ లో నిజమెంత..?

-

ఎప్పుడూ కూడా నెట్టింట్లో ఏదో ఒక ఫేక్ వార్త మనకి కనబడుతూనే ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ వార్త నిజంగా ఫేక్ వార్తా లేదు అంటే నిజమైనదా అనేది మనకు అర్థం కాదు. తాజాగా ఈ తరహా లోనే ఒక వార్త వచ్చింది. అయితే అది ఫేక్ వార్తా లేదంటే నిజమా అనేది ఇప్పుడు చూద్దాం.

 

తాజాగా నెట్టింట్లో ఒక ఫేక్ వార్త వచ్చింది. సోషల్ మీడియాలో ఇందిరా గాంధీ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఇందిరాగాంధీ సీ ఫుడ్ తినడం మనం చూడొచ్చు. బ్రాహ్మిన్ అయ్యుండి కూడా ఆమె సి ఫుడ్ ను తినడం ఏమిటి అని హేళన చేస్తూ ఫోటో పైన రాసి ఉంది.

అయితే మరి నిజంగా ఇందిరా గాంధీ ఫుడ్ తిన్నారా..? లేదు అంటే ఇది ఫేక్ వార్తా అనేది ఇప్పుడు మనం చూద్దాం. చాలా మంది ఇటువంటి ఫేక్ వార్తలను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సరదాగా వాట్సాప్ వంటి వాటిలో కూడా షేర్ చేస్తూ ఉంటారు. అయితే నిజానికి ఇందిరా గాంధీ ఆ ఫోటోలో సీ ఫుడ్ ని తినలేదు.

Image Credit: The Hindu

ఆ ఫోటోని ఎడిట్ చేయడం జరిగింది. అసలైన ఫోటో చూస్తే అందులో ఆమె మొక్కజొన్నపొత్తు తింటున్నారు. కానీ ఆ మొక్కజొన్నపొత్తు ప్లేస్ లో సీ ఫుడ్ ని పెట్టారు. అయితే నిజానికి ఇందిరాగాంధీ
సీ ఫుడ్ ని తినలేదు. కానీ ఫోటోను మర్చి వైరల్ చేశారు. కాబట్టి నెట్టింట్లో వచ్చే ప్రతి వాటిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. నిజమని తెలిస్తేనే వాటిని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news