ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్ బిల్లుపై టాలీవుడ్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్ బిల్లును చిరంజీవి స్వాగితించారు. దేశమంతా ఒకే జీఎస్టీ ఉన్నప్పుడు టికెట్ల ధరలు కూడా అలాగే ఉండాలంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లే టికెట్ల ధరలను నిర్ణయిస్తే… సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందని కోరారు మెగాస్టార్.
సినిమా టికెట్ల ధర విషయంలో పునరాలోచించాలని.. సీఎం జగన్ ను చిరంజీవి కోరారు. అలా జరిగితే… చిత్ర పరిశ్రమలోని కార్మికులు కూడా హర్షిస్తారని తెలిపారు. దీనిని ఏపీ సర్కార్ దృష్టిలో ఉంచుకుని… నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చిరంజీవి ట్వీట్ చేశారు.
కాగా….నిన్న ఏపీ అసెంబ్లీ లో సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సు, రైళ్ల టికెట్ల తరహాలోనే ఇక సినిమా టికెట్లు కొనుక్కొవాలని మంత్రి పేర్ని నాని చెప్పారు. అంతేకాదు.. ప్రతి రోజూ నాలుగు షోలు మాత్రమే వేయాలన్నారు.
ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్ బిల్లుపై చిరంజీవి ట్వీట్. #chiranjeevi #andhrapradesh #tollywood #onlineticketing pic.twitter.com/59BC44g9qb
— NTV Breaking News (@NTVJustIn) November 25, 2021