ఫ్యాక్ట్ చెక్: కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక..ఎందుకంటే?

-

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొన్ని బెనిఫిట్స్ పథకాలను అమల్లొకి తీసుకోని వస్తుంది.ఇప్పటికే ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అయితే కొన్ని రైతులకు మోసం చేస్తున్నాయని కూడా అంటున్నారు. రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు పలు పథకాలను రూపొందిస్తూ వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

 

కేంద్రం పథకాల కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లపై కేటుగాళ్లు కన్నేశారు. సేమ్‌ టు సేమ్‌ ఉండేలా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి అమాయకులను బురిడి కొట్టి్స్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల వల్ల నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. అమాయకులను ఆసరా చేసుకుంటున్న కేటుగాళ్లు.. వారి కోసం వల వేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి రైతులను మోసగిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాలకు సంబంధించి నకిలీ వెబ్‌సైట్లను గుర్తించింది కేంద్రం. ప్రధాన మంత్రి కుసుమ్ యోజన పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారని, ధృవీకరించని లింక్‌లపై క్లిక్ చేయవద్దని ఇంధన మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది.

ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఉత్థాన్ మహాభియాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో సోలార్ పంప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే పంపులకు సబ్సిడీ అందిస్తోంది. PM-KUSUM పథకం కింద రిజిస్టర్ కోసం కొన్ని నకిలీ వెబ్‌సైట్లు వెలువడుతున్నట్లు సమాచారం వచ్చిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫేక్ వెబ్‌సైట్‌లు పథకం నుండి లబ్ధి పొందాలనుకునే వ్యక్తుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు.ఇలాంటి ఫెక్ న్యూస్ ల పై ప్రభుత్వం హెచ్చరించారు.

ప్రభుత్వ శాఖకు సంభందించిన ఏదైనా కూడా రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులను వసూల్ చెయ్యదని చెప్పింది.ఈ నకిలీ వెబ్‌సైట్‌లలో కొన్ని ‘.org, .in.com www.kusumojanaonline.in.net, www.pmkisankusumyojana.co.in, www.onlinekusumyojana.org.in, www.pmkisankusumyojana వంటి డొమైన్ పేర్లతో రిజిస్టర్ చేయబడ్డాయి.

అందువల్ల ప్రధాన మంత్రి-కుసుమ్ యోజన కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరూ మోసపూరిత వెబ్‌సైట్‌లను సందర్శించవద్దని, ఎటువంటి చెల్లింపులు చేయవద్దని సూచించింది. ప్రధాన మంత్రి కుసుమ్ యోజన రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేయబడుతోంది..ఏదైనా ఒక దాని గురించి చేసే ముందు ఆలోచించాలని హెచ్చరిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news