ఇంట్లో వెండి ఏనుగులు ఏర్పాటు చేశారా.. అయితే ఈ సమస్యలు..

-

మనకు ఆక్సీజన్‌ ఎంత అవసరమో.. ఇంటికి వాస్తు అవసరం.. వాస్తుతో ఆటలాడితే.. జీవితం మనతో ఆడేసుకుంటుందన్నట్లు చెప్తారు పండితులు. వాళ్లు చెప్పేది నిజమే.. అయితే ప్రతీ వాస్తు టిప్‌ వెనుక సైంటిఫిక్‌ రీజన్‌ ఉంటుంది. అది పండితులు చెప్పకపోవడంతో… చాలామంది ఈరోజుల్లో ఈ సోదంతా ఎవరు నమ్ముతార్లే అని లైట్‌ తీసుకుంటారు.. సరే ఆ బ్యాచ్‌ గురించి మనకెందుకు..కొంతమంది నిష్టగా ఉండి అన్ని పద్దతులు పాటిస్తారు. అలాంటి వారి విషయానికి వద్దాం.. ఇంట్లో వెండి ఏనుగులు ఉంటే మంచిదని కొందరు అంటుంటారు. ఉంటే మంచిదే కానీ.. అవి ఉండాల్సిన చోట ఉంటేనే వాటి వల్ల వచ్చే లాభాలు వస్తాయి. లేదంటే అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనట..!

ఇంట్లో వెండి ఏనుగును ఏర్పాటు చేయడం ద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. వెండి ఏనుగును ఇంట్లో పెట్టుకోవడం శ్రేయస్కరమని శాస్త్రాలలో చెప్పబడింది. ఇది గణేశుడికి సంబంధించినది. అందుకనే ఏనుగు ఉన్న ఇంట్లో ఆ గజాననుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది జ్యోతిష్కులు అంటున్నారు.

ఇంట్లో వెండి ఏనుగును ఎక్కడ పెట్టాలంటే..

ఇంట్లో వెండి ఏనుగును ఉంచుకోవాలనుకుంటే, వాస్తు ప్రకారం దానిని తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అదే వెండి ఏనుగును టేబుల్‌పై ఉంచితే.. ఆర్ధిక కష్టాలను తొలగిస్తుంది. ఇంట్లో సుఖ సంపదలు పొందడానికి, వెండి ఏనుగు మంచి పరిహారం అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.

స్టడీ రూమ్‌లో వెండి ఏనుగును ఉంచుకోవచ్చు. ఏకాగ్రత పెరిగి, చదువులో మనసు కూడా నిమగ్నమై ఉంటారట..

జత(2) వెండి ఏనుగులు కొని.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెడితే..అదృష్టం వస్తుందట.

భార్యాభర్తల మధ్య గొడవలు లేదా ఉద్రిక్త వాతావరణం ఉన్నట్లయితే.. వారు ఏనుగుల జంటను ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక జత వెండి ఏనుగులను తెచ్చి పడకగదిలో ఏర్పాటు చేసుకుంటే భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట. ఇక ఏనుగులకు ప్రేమకు ఏంటి సంబంధం అని మమల్ని అడగకండే…. ఇది మనలోకం సొంతంగా ఊహించుకుని రాసింది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం అందించిందే మేము మీకోసం ఇవ్వటం జరిగింది.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news