ఫ్యాక్ట్ చెక్: టెలికాం శాఖ నుంచి వాట్సప్ మెసేజ్ వస్తే నమ్మొచ్చా..?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనం ఎన్నో రకాల ఫేక్ వార్తలను వింటున్నాం. అయితే ఇటువంటి ఫేక్ వార్తల వల్ల ఇబ్బందులు వస్తాయి. కనుక అటువంటి వాటిని నమ్మక పోవడమే మంచిది. వాట్సాప్ లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో టెలికామ్ శాఖ నుండి ఎప్పుడైనా మెసేజ్ రావడం చూసారా..? అయితే ఈ ప్రకటన విపరీతంగా వైరల్ అవుతోంది.

అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి మెసేజ్ మీద క్లిక్ చేయగానే రూ. 15,360 కట్టాలని డిమాండ్ చేయడం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాల ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా వ్యాధి మహమ్మారి సమయం నుండి కూడా ఇలా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

అయితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పేరుతో దరఖాస్తు ప్రతిపాదన కనిపించిందని, దానిలో రిజిస్ట్రేషన్ చార్జీగా డబ్బులు చెల్లించాలని ఒక వ్యక్తి కోరినట్లు తెలిసింది. అయితే ఇది ఏ మాత్రం నిజం కాదని… ఇది కేవలం ఫేక్ వార్త అని తెలుస్తోంది.

ఎవరైనా ఇది మిమ్మల్ని మోసం చేయడానికి ఒక మార్గం అని గ్రహించాలి. ఎప్పుడూ కూడా ఎవరికీ బ్యాంక్ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం ఇవ్వవద్దు. కాబట్టి వచ్చే లింక్స్ మీద మరియు ఇలాంటి మెసేజెస్ మీద క్లిక్ చెయ్యవద్దు. క్లిక్ చేసారంటే మోసపోవాల్సి ఉంటుంది అని గ్రహించండి.

Read more RELATED
Recommended to you

Latest news