ఫ్యాక్ట్ చెక్: రెండు వేలు కడితే లక్ష రూపాయిలు లోన్…?

-

ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా నకిలీ వార్తలు కనపడుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవాలి లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైగా నిజం ఏమిటనేది తెలుసుకోకుండా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. కానీ సోషల్ మీడియా లో వచ్చే నకిలీ వార్తలతో జాగ్రత్త పడాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో ఓ వార్త వచ్చింది.

మరి అది నిజమా కాదా..? అనేది ఇప్పుడు చూసేద్దాం. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తని చూస్తే… పీఎం ముద్ర యోజన కింద డబ్బులు వస్తాయని.. లక్ష రూపాయల వరకు లోన్ ని పొందచ్చని దీని కోసం మీరు కేవలం రెండు వేల రూపాయలని లోన్ ప్రొడక్షన్ ఇన్సూరెన్స్ ఫీజు కింద చెల్లించాలి అని ఆ వార్తలో ఉంది. మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూస్తే..

లక్ష రూపాయలు పీఎం ముద్ర యోజన కింద వస్తున్నాయి అన్నది కేవలం ఫేక్ వార్త మాత్రమే ఇది నిజం కాదు దీనికోసం 2000 రూపాయలని చెల్లించకండి. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని మీద స్పందించింది. ఇది వట్టి ఫేక్ వార్త అని తేల్చేసింది. కాబట్టి అనవసరంగా నకిలీ వార్తలని నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news