మనకు తరచూ ఏదో ఒక నకిలీ వార్త వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఏదో ఒక ఫేక్ న్యూస్ వస్తూనే వుంది. అయితే చాలా మంది నకిలీ వార్తని నిజమనుకుని నమ్మి మోసపోతూనే ఉంటారు. అటువంటి ఫేక్ వార్త తో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అయితే తాజాగా ఒక నకిలీ వెబ్ సైట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగాలను భర్తీ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కింద రూ.1,645 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఇటువంటి వాటిని చూసి అస్సలు మోసపోకండి. రాష్ట్రీయఎయునాటకేంద్రీయ ఆర్గనైజేషన్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు… ఆసక్తి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చని నకిలీ వార్త వచ్చింది.
అయితే దీనిని పీఐబీ ఫాక్ట్ చెక్ నకిలీ వార్త అని తెలిపింది. కనుక ఇటువంటి నకిలీ వెబ్ సైట్ తో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే డబ్బులు నష్టపోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలు ఇస్తున్నామంటూ వస్తున్న వెబ్సైట్లని చూసి ఎప్పుడు మోసపోకు కూడదు. అలానే వాటిని మీరు అనవసరంగా షేర్ చేసి ఇతరులని కూడా చిక్కుల్లో పెట్టేయకండి.
– Triveni Buskarowthu