ఫ్యాక్ట్ చెక్: రాబోయే GST కౌన్సిల్ సమావేశంలో ఇళ్లు మరియు దుకాణాల అద్దెపై… 12% GST పన్నును ప్రవేశపెట్టనున్నారా..?

-

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త వస్తూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అన్న సరే సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం.

 

పైగా ఈ మధ్య కాలంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వంటివి సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఫేక్ వార్తలు ఏవో నిజమైన వార్తలు ఏవో కూడా తెలుపుతున్నారు. అయినప్పటికీ సరే నకిలీ వార్తలు ఆగడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మరి నిజంగా అది నకిలీ వార్తా లేదంటే అందులో నిజం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం వచ్చే జీఎస్టీ కౌన్సిల్ మీటింగులో ఇల్లు మరియు దుకాణాల అద్దెపై 12 శాతం జీఎస్టీ పన్ను ప్రవేశపెట్టనుంది అని ఆ వార్తలో ఉంది. అయితే మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం వచ్చే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకోనుంది..? ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ధిక శాఖ మంత్రి ఇటువంటి నిర్ణయాన్ని ఏమి తీసుకోలేదు అని స్పష్టంగా తెలుస్తోంది.

పైగా ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఇది వట్టి నకిలీ వార్త అని క్లియర్ గా తెలిసి పోతోంది. ఇందులో ఏ మాత్రమూ నిజంలేదు ఇటువంటి వాటిని అనవసరంగా నమ్మి చిక్కుల్లో పడకండి. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసింది. ఆర్థిక శాఖ మంత్రి ఇలాంటి నిర్ణయాన్ని ఏమీ తీసుకోలేదు అని స్పష్టంగా తెలుస్తోంది కనుక అనవసరంగా ఇలాంటి ఫేక్ వార్తల్ని ఫార్వర్డ్ చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news