థియేటర్ ను ధ్వంసం చేసిన హీరో విజయ్ ఫ్యాన్స్..

-

దేశంలో సినీస్టార్ల ను చాలా మంది ఫ్యాన్స్ దేవుడితో సమానంగా కొలుస్తుంటారు.తమ అభిమాన నటి నటులకు కొందరు ఏకంగా గుడి కూడా కట్టేస్తారు.ఇక అభిమాన హీరో సినిమా రిలీజైతే వారి ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు.ఎన్టీఆర్ సినిమా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా భారీ కటౌట్లు, వాటికి పాలాభిషేకాలు చేస్తూ ఇలా చాలా హడావిడి చేస్తారు.

ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ స్టార్ హీరోలకు ఇదే రీతిలో అభిమానులు ఉంటారు.తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులు థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు.తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి లోని రామ్ థియేటర్ లో బీస్ట్ సినిమా ట్రైలర్ ను శనివారం ప్రదర్శించారు.ఆ ట్రైలర్ చూసిన అభిమానులు ఆనందం పట్టలేక కాగితాలు చింపి ఎగురవేయడంతో పాటు కుర్చీలు విడగొట్టారు.బండి పైన ఈ పరిణామంతో థియేటర్ యాజమాన్యం గగ్గోలు పెడుతోంది.ఈ నెల 13న థియేటర్ లో బీస్ట్ సినిమా విడుదల ఉండడంతో మారమ్మత్తులు చేయించే పనిలో పడ్డారు థియేటర్ యాజమాన్యం.

Read more RELATED
Recommended to you

Latest news