Fact Check: కోవిడ్ బాధిత కుటుంబాల‌కు కేంద్రం రూ.4వేల చొప్పున ఇస్తుందా ?

-

క‌రోనా నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న ఫేక్ వార్త‌ల‌కు అడ్డు, అదుపూ లేకుండా పోయింది. కొంద‌రు కావాల‌ని ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ఫేక్ వార్త‌లను ప్ర‌చారం చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఫేక్ వార్త‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. నిజానికి ఆ వార్త‌ల‌ను చాలా మంది నిజ‌మే అని నమ్మి మోస‌పోతున్నారు. ఇక తాజాగా మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అదేమిటంటే.. క‌రోనాతో ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఎన్నో ల‌క్ష‌ల మంది చ‌నిపోయిన విష‌యం విదిత‌మే. అయితే కోవిడ్ మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ.4వేల‌ను కేంద్రం అందిస్తుంద‌ని ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం అవుతోంది.

కోవిడ్ /covid
కోవిడ్ /covid

క‌రోనా కేర్ ఫండ్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని అంద‌జేస్తున్నార‌ని ఆ వార్త‌లో ఉంది. అయితే ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఆ స్కీమ్ అబ‌ద్ద‌మ‌ని తేలింది. ఆ వార్త‌లో నిజం లేద‌ని, అది ఫేక్ వార్త అని, క‌నుక దాన్ని నమ్మి ప్ర‌జ‌లు మోస‌పోవ‌ద్ద‌ని కోరింది.

అయితే కోవిడ్ మృతుల కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌నే కేసు మాత్రం సుప్రీం కోర్టులో ఇప్ప‌టికే విచార‌ణ‌లో ఉంది. బాధితుల‌కు ఒక్కొక్క‌రికి రూ.4 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించారు. అయితే అంద‌రికీ అంత మొత్తం అందించ‌డం సాధ్యం కాద‌ని, నిధులు అన్నీ అయిపోతాయ‌ని కేంద్రం కోర్టుకు చెప్పింది. కానీ కోర్టు మాత్రం న‌ష్ట ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని, ఎంత చెల్లిస్తారో చెప్పాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. అందుకు గ‌డువును కూడా విధించింది. ఇక ఆ కేసు విచార‌ణ‌లో ఉంది. కానీ ఇంకా కోర్టు తీర్పు చెప్ప‌లేదు. క‌నుక కేంద్రం కోవిడ్ బాధిత కుటుంబాల‌కు రూ.4వేల చొప్పున అందిస్తుంద‌నే వార్త ఫేక్ అని స్ప‌ష్ట‌మ‌వుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news