పొగ తాగేవారు, శాకాహారుల‌కు క‌రోనా ముప్పు త‌క్కువేనా ? నిజ‌మెంత ?

కరోనా ఏమోగానీ సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్‌ మెసేజ్‌లకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. కొందరు కావాలని పనిగట్టుకుని మరీ ఫేక్‌ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తలను నమ్మిన ప్రధాన మీడియా సంస్థలు కూడా బోల్తా పడుతున్నాయి. ఇక తాజాగా మరో వార్త ఇలాగే మీడియా సంస్థలను సైతం తప్పుదోవ పట్టించింది.

is it true that covid risk is low for smokers and vegetarians

పొగ తాగేవారు, శాకాహారులకు కరోనా ముప్పు తక్కువేనని సీఎస్‌ఐఆర్‌ ఓ సర్వే చేసిందని చెబుతూ ఓ వార్త తెగ ప్రచారం అయింది. దీంతో అది నిజమే కాబోలు అని నమ్మిన ప్రధాన మీడియా సంస్థలు కూడా ఆ వార్తలు ప్రచురించాయి. టీవీల్లోనూ ప్రసారం చేశారు. కానీ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌లో తేలిందేమిటంటే.. ఆ విషయం అంతా అబద్దం అని చెప్పారు.

సీఎస్‌ఐఆర్‌ పైన తెలిపిన విషయానికి సంబంధించి ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా వెల్లడైంది. పొగ తాగేవారిలో మ్యూకస్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, అలాగే శాకాహారులు ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటారు. కనుక వారికి ముప్పు తక్కువే కాబోలునని నమ్మారు. అయితే ఈ విషయంలో ఎంత మాత్రం నిజం లేదని, అంతా అబద్దమని వెల్లడైంది. దీనిపై ఇంకా ఎవరూ పరిశోధనలు చేయలేదని చెప్పారు. కనుక సోషల్‌ మీడియాలో ప్రచారం అయ్యే వార్తలను నమ్మే ముందు ఒక్కసారి వాటిని తనిఖీ చేసుకోవడం మంచిది. లేదంటే ఇదిగో.. ఇలాగే జరుగుతుంది.