తెలంగాణకు సంబంధించి వైఎస్ షర్మిల గట్టిగా పోరాటం మొదలుపెట్టారు. తెలంగాణాలో నిరుద్యోగుల సమస్యలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం షర్మిల చేస్తున్నారు. ఇటీవల ఆమె దీక్ష కూడా చేసిన సంగతి తెలిసిందే. షర్మిల తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. నిరుద్యోగులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.. ఇక నైనా నిద్ర లేవండి అని సిఎం కేసీఆర్ పై ఆమె విమర్శలు చేసారు.
నోటిఫికేషన్లు ఇవ్వండి..ఆత్మహత్యలు ఆపండి అని షర్మిల కోరారు. నిరుద్యోగులు ఎవరు అధైర్య పడొద్దు అని విజ్ఞప్తి చేసారు. నిరుద్యోగుల కోసం ఎంతటి పోరాటానికైన సిద్ధం అని స్పష్టం చేసారు. మీ అక్కగా కోరుకుంటున్న.. ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని విజ్ఞప్తి చేసారు. రేపటి భవిష్యత్ కోసం..నేడు మార్పు తెవల్సిందే అని ఆమె చెప్పుకొచ్చారు. ఆ మార్పు కోసం మనం కలిసి పోరాడుదామన్నారు.
నిరుద్యోగులు అధైర్యపడద్దు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధం. నిరుద్యోగ యువతను .. మీ అక్కగా నేను కోరేది ఒక్కటే. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. రేపటి భవిష్యత్తు కోసం.. నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం మనం కలిసి పోరాడుదాం. pic.twitter.com/fTwoqcVU7F
— YS Sharmila (@realyssharmila) April 28, 2021