ఫ్యాక్ట్ చెక్: జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా ఫ్రీగా రీఛార్జ్ ఇవ్వడంలో నిజమెంత..?

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి కూడా నకిలీ వార్తలు ఏదో ఒకటి వస్తున్నాయి. అయితే ఇలాంటి నకిలీ వార్తలు కనుక ప్రజలు నమ్మారు అంటే అనవసరంగా మోసపోవాల్సి వస్తుంది. భారతదేశంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ ఎప్పుడో మొదలైంది. చాలా రోజుల నుండి కూడా వ్యాక్సిన్ ను ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే బూస్టర్ డోస్ ని కూడా అందిస్తున్నారు.

దాదాపు 150 కోట్ల వ్యాక్సిన్ డోసులుని ప్రభుత్వం ప్రజలకు అందించాయి. అయితే ఈ సందర్భంగా ప్రముఖ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మూడు నెలల పాటు వినియోగదారులకు ఉచితంగా రీఛార్జ్ ని అందిస్తున్న వార్త వస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. దేశంలో రికార్డ్ వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా భారతీయులందరికీ మూడు నెలల పాటు ఫ్రీ రీఛార్జ్ అందిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.

ఈ మెసేజ్ చివర్లో ఒక లింకు ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేశాను అంటే ఇంక అంతే సంగతులు. కాబట్టి అనవసరంగా ఇలాంటి వార్తలు నమ్మద్దు. అస్సలు తెలియని లింక్ మీద క్లిక్ చేయవద్దు. వ్యక్తిగత, బ్యాంకింగ్, లాగిన్ వివరాలు తెలుసుకుని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు.

కనుక జాగ్రత్త పడాలి ఏదైనా వాట్సాప్ ద్వారా ఉచితంగా రీఛార్జ్ చేస్తున్నామంటే ఆలోచించాలి. అంతే కానీ అటువంటి వాటిని నమ్మి అనవసరంగా లింక్ మీద క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఫేక్ వార్తలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి అలానే నకిలీ వార్తలని ఇతరులకి కూడా ఫార్వర్డ్ చెయ్యొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news