భారత ప్రభుత్వానికి సంబంధించిన ఓ టవర్ కోసం భూమి కావాలని, ఎవరైనా భూమి ఇస్తే వారికి రూ.30 లక్షల అడ్వాన్స్ ఇస్తామని ఓ ప్రైవేట్ కంపెనీ ప్రజలను ఆశ్రయిస్తుందంటూ ఓ వార్త నెట్టింట బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ టవర్ ఏర్పాటు కోసం భూమి ఇచ్చిన యజమానికి రూ.30 లక్షల అడ్వాన్స్తో పాటు నెలకు రూ.25వేలు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. రెండ్రోజులుగా బాగా ప్రచారంలోకి వస్తున్న ఈ వార్తపై తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
పీఐబీ ఫాక్ట్ చెక్ ఎక్స్ వేదిగా ఈ వార్తపై స్పష్టత ఇచ్చింది. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. ప్రజలెవరూ దీన్ని నమ్మొద్దని సూచించింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ‘భారత ప్రభుత్వం కోసం ఒక టవర్‌ను ఏర్పాటు చేయడానికి ఒక ప్రైవేట్ కంపెనీ భూమిని సేకరిస్తున్నట్లు నకిలీ లేఖ క్లెయిమ్ చేస్తోంది. ఇందుకుగాను సదరు కంపెనీ భూమి యజమానికి నెలకు రూ.30 లక్షలు అడ్వాన్స్, రూ.25 వేలు అద్దె చెల్లిస్తుంది.’ ఇలా వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ లెటర్ అని ప్రజలంతా ఇది గమనించాలని సూచించింది.
एक फर्ज़ी पत्र के माध्यम से दावा किया जा रहा है कि एक निजी कंपनी, भारत सरकार के लिए टावर लगाने हेतु जमीन का अधिग्रहण कर रही है। इसके लिए कम्पनी भू-स्वामी को 30 लाख एडवांस, 25000 रुपये किराया प्रति माह भुगतान करेगी#PIBFactCheck
✅भारत सरकार द्वारा ऐसा कोई आदेश नहीं दिया गया है pic.twitter.com/EtybnP9vOW
— PIB Fact Check (@PIBFactCheck) July 26, 2024