మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆక్వా రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామని కేంద్రం ప్రకటన చేసింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన కేంద్ర మంత్రి మురుగన్…అనంతరం కేంద్ర బడ్జెట్ సారాంశాన్ని, ఏపీకి చేసిన లబ్దిని వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ… వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి సహకారం అన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డులు అందచేయనున్నామని వివరించారు.
కిసాన్ క్రెడిట్ కార్డులను ఆక్వా రైతులకూ కేంద్రం అందచేసేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏపీ నుంచే 60 శాతం రొయ్యల ఎగుమతులు జరుగుతున్నాయని… రొయ్యల సాగు మొదలుకుని, ఎగుమతుల వరకు నాబార్డు ద్వారా ఆక్వా రైతులకు ఆర్థిక చేయూత అందించేలా చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి మురుగన్. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చామని తెలిపారు.