ఫ్యాక్ట్ చెక్: పీఎం కుసుమ యోజన కింద కేంద్రం సోలార్ పంప్స్ ని ఇంస్టాల్ చేయనుందా..? నిజమెంత..?

-

ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేక్ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు. కేంద్రం ఈ స్కీములు తీసుకు వచ్చింది ఆ స్కీములు తీసుకు వచ్చిందని ఫేక్ వార్తలు రోజు రోజుకీ వస్తున్నాయి. అదే విధంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా వ్యాక్సిన్ కి సంబంధించిన విషయాలు, మెడిసిన్ కి సంబంధించిన విషయాలు వంటి నకిలీ వార్తలు వస్తున్నాయి.

నిజంగా ఇలాంటి ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలి. లేదంటే మనం అనవసరంగా మోస పోవాల్సి వస్తుంది. ప్రధానమంత్రి కుసుమ యోజన కింద కేంద్ర ప్రభుత్వం సోలార్ పంప్స్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. ఇన్ స్టాల్ చేసుకోవడానికి చార్జీలు చెల్లించాలని అంటోంది. అయితే అసలు ఈ వార్త ఏమిటి..? ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. ఒక అప్రూవల్ లెటర్ ని ప్రధాన మంత్రి కుసుమ యోజన కింద వచ్చింది.

అందులో లీగల్ ఛార్జీలు 5600 చెల్లించాలని ఉంది. అలానే ఎడిషనల్ రిజిస్ట్రేషన్ చార్జీలు ఐదు వేల రూపాయలు. ఇలా కడితే సోలార్ పంప్ ఇన్స్టాల్ అవుతుంది అని ఆ మెసేజ్ లో ఉంది. ఈ అప్రూవల్ లెటర్ ని తీసుకు వచ్చిందా లేదా అనే విషయానికి వస్తే.. ఇది నకిలీ వార్త అని స్పష్టం గా తెలుస్తోంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇది నకిలీ వార్త అని చెప్పేసింది. కనుక ఇలాంటి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండండి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news