RAJAMOULY : దర్శకుడు రాజమౌళి రెమ్యూనరేషన్ పై నెటిజన్లు ఫైర్..!

-

టాలీవుడ్ నటి దేవిక బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. అయితే ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతేకాదు ఆమె ఆరోగ్యం మెరుగు కావడానికి ఎవరైనా ఆర్థిక సహాయం చేయండి అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.

“బాహుబలి సినిమా కోసం దేవిక తో కలిసి పని చేశాను. ఎన్నో పోస్టు ప్రొడక్షన్ పనులు ఆమె కోఆర్డినేటర్ గా పనిచేశారు. ఆమె అభిరుచి అలాగే అంకితభావం నిజంగా సాటి లేనివి. కానీ దురదృష్టవశాత్తూ ఆమె బ్లడ్ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. నేను ఇక్కడ షేర్ చేస్తున్న కిట్టు ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో మీ వంతు సహాయం చేయాలని కోరుతున్నాను”అంటూ రాజమౌళి పోస్ట్ చేశారు.

అయితే రాజమౌళి చేసిన ఆ పోస్ట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ” మీరు బాహుబలి సినిమా తో ఎనిమిది వందల కోట్లు సంపాదించారు గా.. మీరు సహాయం ఎందుకు చేయరు ? అంటూ ప్రశ్నించారు నెటిజన్లు. ఒక్క సినిమాకు వంద కోట్లు తీసుకునే నువ్వు మొదటగా ఆమెకు సహాయం చేయు అంటూ మరో నెటిజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొదట నువ్వు చేశాక మేం చేస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news