Fact Check: ఈ ఫొటోలో ఉన్న ప‌క్షులు నిజ‌మైన‌వేనా ?

-

సోష‌ల్ మీడియాలో పోస్ట్ అవుతున్న ఫొటోలు, వీడియోలు, వార్త‌ల్లో ఏది న‌కిలీనో, ఏది అస‌లుదో తెలుసుకోవ‌డం క‌ష్టంగా మారింది. కొన్ని సార్లు అలాంటి పోస్టులు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌నే బురిడీ కొట్టిస్తున్నాయి. ఇక తాజాగా అలాంటిదే ఒక ఫొటో అంద‌రి భావ‌నను త‌ప్ప‌ని నిరూపించింంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

the birds in this photo are real or not fact check

ఫేస్‌బుక్ లో యానిమ‌ల్స్ టీవీ అనే అకౌంట్‌కు 1,22,693 మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. వారు మ‌లేషియాకు చెందిన ఫ్రాగ్‌మౌత్ ప‌క్షులు ఇవి.. అంటూ ఒక ఫొటోను షేర్ చేశారు. అయితే నిజానికి ఆ ప‌క్షులు నిజం కాద‌ని, అది ఆర్ట్ వ‌ర్క్ అని తేలింది.

ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫిక్ ఇల్ల‌స్ట్రేట‌ర్ జోష్ దిక్‌గ్రాఫ్ ఆ ఆర్ట్ వ‌ర్క్‌ను ఫొటోషాప్ లో క్రియేట్ చేశాడు. ఆయ‌న‌కు ఇదే విష‌య‌మై మెయిల్ చేయ‌గా ఆ ప‌క్షులు నిజం కాద‌ని, ఆర్ట్ వ‌ర్క్ ద్వారా క్రియేట్ చేయ‌బ‌డిన‌వి అని తెలిపారు.

ఆ ఆర్ట్‌వ‌ర్క్‌ను క్రియేట్ చేసేందుకు గాను జోష్ ఎంతో శ్ర‌మించాడు. వివిధ ర‌కాల ఆకులు, పువ్వుల‌ను అత‌ను ఫొటోలు తీశాడు. త‌రువాత ఫొటోషాప్ స‌హాయంతో సుమారుగా 60 గంట‌లు క‌ష్ట‌ప‌డి 3000 లేయ‌ర్ల‌ను ఏర్పాటు చేసి ఆ వాటిని ప‌క్షులుగా తీర్చిదిద్దాడు. అందువ‌ల్ల ఆ ప‌క్షులు నిజం కాద‌ని, అది ఆర్ట్ వ‌ర్క్ ఫొటో అని తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news