మీ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచాలా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ ని ఉపయోగిస్తున్నారు. అలానే స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ని కూడా వాడుతున్నారు. నిజానికి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మన పనులు చాలా సులభంగా అయిపోతున్నాయి. మనకి తెలియని వాటిని ఆన్లైన్లో ఈజీగా తెలుసుకుంటున్నాము.

 

అదే విధంగా గేమ్స్ మొదలు సినిమాల వరకు ఇంటర్నెట్ తో మనం ఎంతో ఎంటర్టైన్మెంట్ ని పొందుతున్నాను. అయితే స్మార్ట్ఫోన్ యూజర్లు అనుకున్న స్థాయిలో ఇంటర్నెట్ వేగాన్ని కొన్ని సార్లు పొందలేక పోవచ్చు. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు అయితే ఇలా మీరు చేయండి. ఇలా కనుక చేశారంటే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. అయితే మరి ఇంటర్నెట్ స్పీడ్ ని ఎలా పెంచుకోవాలి అన్నది చూసి దీని ద్వారా మీరు స్పీడ్ ని పెంచుకోవచ్చు మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.

డేటా వినియోగాన్ని చూడండి:

చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. ఆ పరిమితి గడువు ముగిసిన తర్వాత స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది కాబట్టి ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ గా పని చేయనట్లయితే డేటా వినియోగాన్ని తనిఖీ చేయండి.

ఫోన్ రీస్టార్ట్ చేయండి:

ఇంటర్నెట్ స్పీడ్ తగ్గినట్లయితే ఫోన్ ని రీస్టార్ట్ చేయండి తర్వాత స్పీడ్ పెరిగే అవకాశం ఉంటుంది.

ఫ్లైట్ మోడ్ లో పెట్టండి:

మీ ఫోన్ ని ఒకసారి ఫ్లైట్ మోడ్ లో పెట్టి మళ్ళీ తీసేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది.

ఆటో డౌన్లోడ్ అప్ డేట్ ఆపండి:

ఆటోమేటిక్ గా మన ఫోన్ లో యాప్స్ కొన్ని కొన్ని సార్లు డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. ఈ కారణంగా కూడా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. దాన్ని ఆఫ్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది.

నెట్వర్క్ సెట్టింగ్స్ ని రీసెట్ చేయండి:

ఫోన్ యొక్క సెట్టింగ్లని మార్చినప్పటికీ చాలాసార్లు వేగం తగ్గుతుంది. కనుక ఒకసారి మీ ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్స్ ని రీసెట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version