వేళ్ళు విరుచుకోవడం వలన కూడా సమస్యలు వుంటాయని మీకు తెలుసా..?

చాలా మందికి వేళ్ళు విరుచుకునే అలవాటు ఉంటుంది. మీరు కూడా తరచుగా వేళ్ళను విరుచుకుంటూ ఉంటారా..? అయితే తప్పకుండా దాని వల్ల కలిగే హాని గురించి తెలుసుకోవాలి. చాలా రిపోర్టులలో వేళ్ళను విరుచుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని వుంది. అలానే ఎముకలు కూడా డామేజ్ అయ్యే ప్రమాదం కలుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మనం వేళ్ళను తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనేది చూద్దాం.

అసలు ఎందుకు వేళ్ళను విరిచేటప్పుడు శబ్దం వస్తుంది..?

మనం వేళ్ళను విరిచేటప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటంటే జాయింట్స్ లో లిక్విడ్ అనేది ఉంటుంది. దీన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటారు. ఈ లిక్విడ్ ఎముకల మధ్య ఇబ్బంది కలగకుండా రాపిడి జరగకుండా గ్రీజ్ లాగ పనిచేస్తుంది. ఎక్కువ సార్లు వేళ్ళను విరిస్తే జాయింట్ల మధ్య లో ఉండే ఫ్లూయిడ్ గ్యాస్ వలన వచ్చే బబుల్స్ కూడా పగిలిపోయి సౌండ్ వస్తుంది. ఒకసారి వేళ్ళను విరిచాక 15 నుంచి 30 నిమిషాల పాటు సమయం తిరిగి మళ్లీ ఫామ్ అవ్వడానికి పడుతుంది. అందుకనే వేళ్ళు విడిచిన వెంటనే మళ్ళీ శబ్దం రాదు.

దీని వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది..?

వేళ్ళను విరుచుకోవడం వల్ల లిక్విడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ కనుక పూర్తిగా అయిపోతే ఆర్థరైటిస్ సమస్యలు వస్తాయి. స్వెల్లింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది.