బుధవారం మొదలైన.. MI ఫ్యాన్ ఫెస్టివల్ ఈనెల 12 వరకు ఉంటుంది. కొన్ని స్మార్ట్ ఫోన్లపై.. ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. భారీ డిస్కౌంట్లతో ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లతో ఉన్న షియోమీ 11టీ ప్రో 5జీ మొబైల్ ను అందిస్తున్నారు. షియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ, లేటెస్ట్‌గా లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 ప్రో+ ఫోన్‌పై కూడా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి.
Xiaomi 11T Pro 5Gపై ఆఫర్లు..
ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సందర్భంగా 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న షియోమీ 11టీ ప్రో 5జీ బేస్ మోడల్ రూ.39,999 ధరకు అందుబాటులో ఉంది.
అమెజాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) క్రెడిట్ కార్డుతో కొంటే ఈ మొబైల్‌పై రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేనా.. ఇంకా.. రూ.1,000 కూపన్ కూడా యాడ్ చేయవచ్చు.
అలాగే mi.comలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.1000 విలువైన ఆఫర్ లభిస్తుంది.
మొత్తంగా షియోమీ 11టీ ప్రో బేస్ వేరియంట్‌ను రూ.33,999కే దక్కించుకోవచ్చు.
8జీబీ ర్యామ్ + 256జీబీ, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్లకు కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అలాగే ఎక్స్చేంజ్‌పై రూ.5వేల అదనపు డిస్కౌంట్ ఇస్తున్నారు.
స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 6.67 ఇంచుల ట్రూ 10-బిట్ అమోలెడ్ డిస్‌ప్లే, డాల్బీవిజన్, హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్, 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లను Xiaomi 11T pro 5G కలిగి ఉంది.
Xiaomi 11 Lite NE 5Gపై ఆఫర్లు..
షియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ మొబైల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర ప్రస్తుత సేల్‌లో రూ.26,999గా ఉంది.
Mi.comలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.5000 డిస్కౌంట్ దక్కుతుంది. రూ.1000 ఆఫర్ కూపన్ యాడ్ చేయవచ్చు.
అమెజాన్‌లో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొంటే ఈ మొబైల్‌పై కూడా రూ.5000 తక్షణ డిస్కౌంట్ వర్తిస్తుంది. అలాగే రూ.1,000 కూపన్ కూడా జత చేయవచ్చు.
Xiaomi 11 Lite NE 5G మొబైల్ బేస్ వేరియంట్‌ను రూ.20,999కే కొనుగోలు చేయవచ్చు.
8జీబీ ర్యామ్ వేరియంట్‌కు కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
6.81 మిల్లీమీటర్ల మందం, 158 గ్రాముల బరువుతో ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం స్లిమ్, లైట్ వైట్ ఫోన్‌గా షియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ నిలుస్తోంది.
స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 6.55 ఇంచుల అమోలెడ్ 10 బిట్ ఫుల్ హెచ్‌డీ+ డాట్ డిస్‌ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 4250mAh బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది.
Redmi note 11 pro 5Gపై కూడా మంచి ఆఫర్లు..
తాజాగా విడుదల చేసిన రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ మొబైల్‌పై కూడా ఆఫర్ ఉంది.
6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ బేస్ వేరియంట్ ధర రూ.20,999గా ఉండగా.. ఎంఐ.కామ్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై, అమెజాన్‌లో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై రూ.2వేల డిస్కౌంట్ లభిస్తోంది.
ఇంకెందుకు ఆలస్యం… కొత్త ఫోన్ కొనాలనుకునేవారు.. ఈ ఆఫర్లో తీసేయండి..!