మందు మానేయకుండానే లివర్ ని తోటకూర విత్తనాలతో హెల్తీగా ఉంచేయొచ్చు.!

-

ఆల్కాహాల్ త్రాగడం ఈరోజు అందరికీ అలవాటై పోయింది. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా..అందరూ తాగేస్తున్నారు. ఇలా తాగటం వల్ల పొట్ట ప్రేగులనుంచి ఆల్కాహాల్ లివర్ లోకి వెళ్లిపోతుంది. లివర్ సెల్స్ లో ఉండే ద్రావణాన్ని సైట్ ప్లాసమ్ అంటారు. ఈ ద్రావకం కణజాలం దెబ్బతిని బయటకు వచ్చేస్తుంది. ఇది రక్తంలోకి వచ్చి కరగటం వల్ల బ్లడ్ లో SGOT, SGPT అనే లెవల్స్ పెరిగిపోతాయి. ఆల్కాహాల్ తాగేవారికి..లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు ఇవి ఉండాల్సిన దానికింటే పెరుగుతుంటాయి. ఇవి 40లోపు ఉండటం ఆరోగ్య లక్షణం..అంతకు మించి ఉన్నాయి అంటే..మీ లివర్ సెల్స్ డామేజ్ అవుతున్నట్లే. ఈ లివర్ సెల్స్ ఆల్కాహాల్ తాగేవారికి డామేజ్ అవకూకడదు..ఈ SGOT, SGPT కంట్రలోగా ఉండాలంటే…మెయిన్ గా ఒకటి ఉపయోగపడుతుంది. అదేంటో ఈరోజు చూద్దాం..

తోటకూర విత్తనాలు..ఈ విత్తనాలను ఆల్కాహాల్ తాగేవారు వాడితే..లివర్ కణజాలం డామేజ్ అవకుండా.ఆ కణాల్లో ఉండే సైటో ప్లాస్మ్ అనేది కాపాలకాస్తుంది. ఇలా రక్షిస్తుందని సైంటిఫిక్ గా అర్జెంటినా దేశస్థులు 2011లో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ శాన్ లూయిస్ వారు నిరూపించారు. వారి పరిశోధనా సారంశం ఏ చెప్తుందంటే..

ఈ తోటకూర విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. ఆవాలు కంటే కూడా వీటి సైజ్ చిన్నది. అసలు ఈ తోటకూర విత్తనాల గురించి చాలామందికి తెలియదు..వాడతారు అని కూడా మనకు పెద్దగా అవగాహాన ఉండకపోవచ్చు..ఈ విత్తనాలుకు కనుగ వాడితే..ఇందులో ఉండే టానిన్స్ (Tannins), యాస్కార్ బేట్( Ascorbate) గుట్లాతియోన్( Glutathinone), యుబిక్వినాల్( Ubiquinol), కెరిటినాయిడ్స్ (Carotenoids), ఈ ఐదు కెమికల్స్ అనేవి తోటకూర విత్తనాల్లో ఉంటాయి..ఇవి ఏం చేస్తాయంటే..

మన శరీరం కణాల సముదాయం..శరీరం మొత్తంలో 125 ట్రిలియన్ కణాలు ఉంటాయి. లివర్ కణాల లోపల ద్రావకం ఉంటుంది. ఒక బండిలో ఇంజనాయిల్ ఎంత ముఖ్యమే..కణాలకు ఈ ద్రావకం అంత అ‌వసరం. ఆ ద్రావకం బయటకు పోకుండా..కాపాలాకేసేది…కణపొర. ఆల్కాహాల్ తాగేవారికి..కణపొర దెబ్బతిని ద్రావకం లీక్ అయిపోతుంది. తోటకూర విత్తనాల్లో ఉండే ఐదు కెమికల్స్..కణపొర నుంచి ద్రావకం లీక్ అ‌వకుండా నిరోధించడానికి కరెక్టుగా పనికొస్తున్నాయని పరిశోధనలో తేలింది. లివర్ లో SGOT, SGPT లెవల్స్ పెరుగుతాయి.

కాబట్టి ఏ రకమైన ఆల్కాహాల్ తాగేవారికైనా..లివర్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండలాంటే..లివర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. లివర్ బాగుంటేనే..శరీరంలో ఏ దోషాన్ని అయినా క్లీన్ చేస్తుంది. కాబట్టి లివర్ ఆరోగ్యం కోసం..ఆల్కాహాల్ తాగేవారు తోటకూర విత్తనాలు తినటం చాలా మంచిది. తాగొద్దు అని చెప్తే మీరు ఎలాగూ మానరు కదా..!

తోటకూర విత్తనాలను ఎలా వాడాలి?

తోటకూర విత్తనాలను దోరగా వేపించి అలా తినేయొచ్చు. వేపించిన తోటకూర విత్తనాలను..ఖర్జూరంతో , తేనెతో ఉండలు చేసుకుని తినొచ్చు. డైరెక్టుగా అయినా చేయొచ్చు లేదా..పొడి చేసి అయినా చేసుకోవచ్చు. ఇలా కూడా కాదంటే..వేపించిన తోటకూర విత్తనాలను పొడి చేసుకుని కూరల్లో కూడా వాడుకోవచ్చు. వేపించిన తోటకూర విత్తనాలను చట్నీలాగా చేసుకోవచ్చు..కారపొడి లాగా అయినా చేసుకోవచ్చు. ఇన్ని రూపాల్లో తోటకూర విత్తనాలను మనం ఉపయోగించుకోవచ్చు.

ఆల్కాహాల్ తాగేవారికి విటమిన్ C, విటమిన్ A, విటమిన్ E ఎక్కువగా కావాలి. ఆల్కాహాల్ దోషాన్ని క్లీన్ చేయాలి. తోటకూర విత్తనాల్లో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. జామకాయలు, పుల్లటి బత్తాయి, కమలారసం తాగుతూ ఉంటుంటే..మీరు ఆల్కాహాల్ తాగిన లివర్ డామేజ్ కాకుండా ఉంటుందని అధ్యయనంలో నిరూపించారు.

ఈరోజుల్లో బీర్, వైన్ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. టేస్ట్ కోసం వాటిని తాగి..అదే అలవాటుగా మార్చుకున్నవాళ్లు కూడా ఉన్నారు. మానేయటం కష్టమే..అది ఇచ్చే ప్రశాంతత, కిక్కు ఇక ఏదీ ఇవ్వలేదన్నట్లు అనిపిస్తుంది..ఆల్కహాల్ తాగేవారికి. కాబట్టి మీరు మీ ఆహారంలో తోటకూర విత్తనాలును కచ్చితంగా భాగం చేసుకున్నారంటే..లివర్ కు చాలా మేలు చేసినట్లే.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news