Video : మచిలీపట్నం వద్ద చిక్కిన 1500 కిలోల భారీ చేప

-

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ వరద పోటెత్తింది. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఇప్పటికీ ఎగువ నుంచి వస్తున్న వరదలతో కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అయితే ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు వాటిలో పలురకాల చేపలు కూడా ఏపీకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెరువులు, వాగుల్లో మత్స్యకారులు, యువకులు చేపల వేటకు వెళ్తున్నారు.

ఈ క్రమంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండిలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ పేద్ద చేప చిక్కింది. చూసేందుకు తిమింగిలం కంటే పెద్ద ఆకారంలో తెల్లటి మచ్చలతో కనిపిస్తున్న ఈ చేప పేరు టేకు చేప. మరి ఇంతపెద్ద చేప మత్స్యకారుల వేటలో దొరికింది. కానీ ఈ టేకు చేప తినేందుకు పనికిరాదని ఔషధాల తయారీలో మాత్రమే ఉపయోగిస్తారని వ్యాపారులు అంటున్నారు. మత్స్యకారులు క్రేన్‌ సాయంతో టేకు చేపను బయటకు తీశారు. మచిలీపట్నం నుంచి చెన్నై కేంద్రంగా ఈ టేకు చేపను వ్యాపారస్థులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version