వైరల్ ;చిన్న గుంతలో 60 పాములు, తెలంగాణాలో కలవరం…!

-

ఒక పాము పిల్ల కనపడితే…? దాన్ని చంపేస్తాం. మరి 60 పాము పిల్లలు కనపడితే…? ముందు భయం తో గుండె ఆగిపోద్ది. వాటిని చూడగానే కంటి నిండా నిద్ర ఉండదు ముందు. తెలంగాణాలోని కామారెడ్డి జిల్లాల్లో ఒక్క చిన్న గుంతను తవ్వి చూస్తే అందులో ఏకంగా 60 పాము పిల్లలు బయట పడ్డాయి. దోమకొండ మండలం గొట్టిముక్కుల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అక్కడి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే… గురువారం రాత్రి గ్రామంలోని మున్నూరుకాపు వాడలోని హనుమాన్‌ ఆలయం పక్కన చిన్న రంధ్రంలో నుంచి పాము పిల్లలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో అక్కడ ఉన్న స్థానికులు వాటిని గుర్తించారు. వెంటనే చుట్టూ ఉన్న వారు అందరూ వచ్చి… పాములు వెళ్తున్న రంధ్రాన్ని తవ్వి చూసారు. అందులో నుంచి చాలా పాము పిల్లలు బయటకు వచ్చాయి.

అవి అన్నీ విషపూరిత పాము పిల్లలు కావడంతో వాటిని జాగ్రత్తగా చంపేశారు. మొత్తం 60 పాము పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు మీడియాకు తెలిపారు. అయితే తల్లి పాము మాత్రం ఎంత వెతికినా సరే అది దొరకలేదు. అందులో నుంచి బయటకు వచ్చి మళ్లీ లోపలికే వెళ్లిందని, వెతికినా దొరకలేదని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత జాగ్రత్తగా సిమెంట్ తెచ్చి దాన్ని పూడ్చివేసారు. అయితే పాము పిల్లలను అలా చంపడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news