కుక్కను ఇంటర్వ్యూ చేసిన నటి.. వైర‌ల్ వీడియో

-

ఐఫా అవార్డు వేడుకలు ముంబైలో గత బుధవారం గ్రాండ్‌గా జరిగాయి. భారీ ఎత్తున బాలీవుడ్ న‌టులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అయితే ఆ అవార్డు ఫంక్షనుకు ఓ అనుకొని అతిధి వచ్చింది. ఎంత మంది సెక్కూరిటీ ఉన్నా వాళ్లను దాటుకొని 2019, 20వ ఎడిషన్ వేడుకల్లో ఓ వీధి కుక్క కూడా పాల్గొంది. దాంతో ఎంతో మంది తారల నడుమ ఈ కుక్క ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది.

గెస్ట్ ల కోసం ఏర్పాటు చేసిన గ్రీన్‌ కార్పెట్‌ మీద అటు ఇటు తచ్చాడటం మొదటుపెట్టింది.ఈ సమయంలో ఆ కుక్కను గమనించిన నటి అదితి భాటియా దాన్ని దగ్గరకు తీసుకుంది. దీంతో ఆమె మైక్‌ పట్టుకుని ఆ కుక్కను ఇంటర్వ్యూ చేశారు. మొదట ఆ కుక్కను పలకరించగానే అది ప్రేమగా ఆమెతో కరచాలనం చేసింది. అనంతరం ఆమె కొన్ని ప్రశ్నలు అడగ్గా మౌనంతోనే సమాధానం చెప్పింది. అదితి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

ఈ కుక్క ఒక్కసారిగా హైలెట్‌గా నిలిచింది. ఇది షేర్‌ చేసిన రెండు రోజుల్లోనే ఈ వీడియో 6 లక్షల వ్యూస్‌ సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే ఆ కుక్క ఎంతో పద్ధతిగా ఉండటాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news