పెన్ క్యాప్ మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్న బాలుడు, నానా తంటాలు పడిన వైద్యులు…!

-

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఊపిరితిత్తుల నుండి పెన్ క్యాప్ ని తొలగించడంతో 12 ఏళ్ల బాలుడికి పునర్జన్మ లభించింది. గురువారం ఆపరేషన్ చేయడంతో అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కోల్‌కతాకి దక్షిణాన ఉన్న గారియాలో నివసిస్తున్న బాలుడు నిరంతరంగా దగ్గు మరియు జలుబు సమస్యలతో బాధపడుతున్నాడు. దీనితో బాలుడి కుటుంబ సభ్యులు అతడిని సేథ్ సుఖ్లాల్ కర్ణాని మెమోరియల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

అయితే అతను ఆ సమస్యతో బాధపడటానికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడిన వైద్యులు, అతనికి స్కానింగ్ తీయాలని నిర్ధారించారు. డాక్టర్లు సీటీ స్కాన్ నిర్వహించి ఎడమ ఊపిరితిత్తు లోపల పెన్ క్యాప్ ఉన్నట్టు గుర్తించారు. నవంబర్లో అతను ఈ క్యాప్ మింగినట్లు బాలుడి కుటుంబ సభ్యులు వైద్యులకు చెప్పారు. అతన్ని స్థానిక నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లినప్పుడు, అక్కడి వైద్యులు బాలుడుకి సరైన చికిత్స చేయలేదు.

నిజంగా మింగితే అతను చనిపోతాడని వాళ్ళు చెప్పడంతో తల్లి తండ్రులకు అతను మింగలేదని స్పష్టత వచ్చింది. అయితే అప్పటి నుంచి బాలుడు దగ్గు మరియు జలుబుతో బాధపడుతున్నాడు. దీనితో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్ళగా గురువారం బ్రోంకోస్కోపీ చేసారు. అతడి ఆరోగ్యం మెరుగు పడుతుందని, స్థిరంగా ఉందని ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాబట్టి పిల్లలు పెన్ క్యాప్ లు మింగకుండా జాగ్రత్త పడండి.

Read more RELATED
Recommended to you

Latest news