వింత: గుర్రంపై స్వారీ చేసిన వధువు…!

-

సాధారణంగా వివాహానికి వరుడు గుర్రంపై రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ అంత రివర్స్ జరిగింది. వధువే గుర్రం మీద వరుడు వద్దకి వచ్చింది. ఇది కధ కాదండి నిజమే. వివరాల లోకి వెళితే… మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని సత్నా జిల్లాలో ఇది చోటు చేసుకోవడం జరిగింది. వధువు గుర్రం పై స్వారీ చేస్తూ వరుడి ఇంటికి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

strange bride
strange bride

వరుడు గుర్రం పై ఊరేగుతూ రావడం భారతీయ వివాహ సంప్రదాయం. కానీ ఇక్కడ వధువు వచ్చి వైరల్ అయ్యింది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో షికార్లు కొడుతోంది. భిన్నంగా సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే వధువు గుర్రం పై స్వారీ చేస్తూ వరుడి నివాసానికి వచ్చింది. అయితే వాలెచా కుటుంబానికి ఈమె ఏకైక కుమార్తె. అందుకే దీపా తన పెళ్లి రోజు నాడు వరుడి ఇంటికి గుర్రం పై స్వారీ చేస్తూ వెళ్లాలనే ఆమె కోరికను పూర్తిగా నెరవేర్చుకుంది.

గుర్రం పై స్వారీ చేస్తూ ఆమె వెళ్లి కుమార్తెలు ఎవరికీ భారం కాదని సమాజానికి సందేశం ఇవ్వాలనే ధ్యేయం తోనే ఇలా చేసింది ఆ వధువు. దీనితో ఈమె గుర్రం పై వరుడి ఇంటికి వచ్చింది. ఆడవాళ్ళకి కూడా సమాన హక్కులున్నాయని చెబుతూ వధువు గుర్రపు స్వారీ చేస్తూ ఈ ఫోటోలని, వీడియోల్ని షేర్ చేసింది. అందరు కూడా వీటిని చూసి ఆమెని అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news