నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లి సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై ఆగ్రహంలో ఉన్న కేంద్ర సర్కారు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాక్టర్ ర్యాలీలో హింస అనంతరం ట్విటర్ ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టిన కేంద్రం, ఖలీస్థాన్ సానుభూతి పరులు గానీ, పాకిస్థాన్‌తో లింకులున్న ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని ట్విటర్‌కు నోటీసులిచ్చింది.
1,178 ఖాతాలపై..
‘రైతుల మారణహోమం’ లాంటి ప్రమాదకర హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్న 250 ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించిన కొన్ని రోజుల వ్యవధిలోనే మరోసారి గట్టిగా ఆదేశాలిచ్చింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ వేదికగా, రైతుల ఆందోళనలపై తప్పుడు సమాచారాన్ని చేççస్తున్న పాక్, ఖలీస్థాన్‌లతో సంబంధాలున్న 1,178 ఖాతాలు . ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తూ వెంటనే వాటిని తొలగించాలని కోరింది.
రాజీనామాకు ఒత్తిడి కారణమా..?
ట్విటర్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ మహిమా కౌల్ రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాల మేరకు రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారు. గతనెలలో కౌల్ పదవీ విరమణ చేసినా, మార్చి దాకా డైరెక్టర్‌గా ఉంటారు. ఇటీవల చోటు చేసుకున్న వివాదానికి ఆమె రాజీనామా సంబంధం లేదని భావిసున్నా.. కొన్ని పెద్ద తలకాయల ఒత్తిడి మేరకే రాజీనామా చేసినట్లు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.