ఓరి బాబోయ్.. ట్రంప్ దెబ్బకు భారత్‌కు ఎంత నష్టమో తెలుసా…?

-

అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అందరికి తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో పాగా వేయడానికి అక్కడ వనరుల మీద కన్నేస్తున్న అమెరికా ఏదోక అలజడి సృష్టిస్తూనే ఉంది. ఇటీవల అమెరికా ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సులైమానిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఆయన లక్ష్యంగా డ్రోన్ తో దాడి చేయించిన అమెరికా అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ ని ముగించింది.

అప్పటి నుంచి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ దెబ్బ మన మీద కూడా గట్టిగానే పడింది. ఒకే రోజు రూ.3 లక్షల కోట్లు ఎగిరిపోయింది మన సంపాదన. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్ సోమవారం కుప్పకూలింది.

బెంచ్‌మార్క్ సూచీలు భారీగా పడిపోయాయి. మన స్టాక్ మార్కెట్ పేకమేడలా కూలిపోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 851 పాయింట్ల మేకు పతనమైంది. నిఫ్టీ కూడా 252 పాయింట్లు పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 788 పాయింట్ల నష్టంతో 40,677 వద్ద, నిఫ్టీ 234 పాయింట్ల నష్టంతో 11,993 వద్ద ముగిసాయి. నిఫ్టీ 12 వేల కిందకు పడిపోయింది. రూపాయి పతనం, క్రూడ్ ధరల పెరుగుదల, బలహీనమైన అంతర్జాతీయ మార్కెట్లు వంటి అంశాలన్నీ ఇన్వెస్టర్లను దెబ్బ తీసాయి.

Read more RELATED
Recommended to you

Latest news