ఉరి తీసే తలారికి ఎంత జీతం ఇస్తారో తెలుసా…?

-

నిర్భయ కేసులో నలుగురు దోషులను ఈ నెల 22 న అధికారులు ఉరి తీయనున్నారు. ఈ నేపధ్యంలో ఉరి తీసే తలారుల గురించి పెద్ద చర్చ జరుగుతుంది. అసలు వారు ఎవరు…? వారికి ఇచ్చే జీతం ఏంటి..? ఏయే రాష్ట్రాల్లో ఉన్నారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. తీహార్ జైల్లోనే నలుగురు దోషులు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్‌ని ఉరి తీయబోతున్నారు. నలుగురిని ఒకేసారి ఉరి తీయనున్నారు.

ఒకసారి తలారుల గురించి చూస్తే, నిర్భయ దోషులను పవన్ అనే తలారి ఉరితీస్తాడని సమాచారం. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారిక తలారులు ఉన్నారు. నటా మాలిక్ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్ తలారిగా పని చేయగా రికార్డుల ప్రకారం అతడు 25 మందిని ఉరి తీశాడు. నటా మాలిక్‌కు నెలకు రూ.10వేల జీతం చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వం. ఉరి తీసిన ప్రతి సారి రూ.5000-10000 భత్యం ఇచ్చేవారు.

2008లో మాలిక్ మరణించడంతో ఆయన స్థానంలో ఆయన కుమారుడు మెహ్తాబ్ వచ్చారు. నటా మాలిక్‌కు ముందు అతడి తండ్రి, తాత కూడా తలారులుగా చేసారు. ఇక మీరట్‌కు చెందిన పవన్ ఉత్తరప్రదేశ్ తలారిగా ఉన్నారు. పార్ట్‌టైమ్ పనిచేసే ఆయనకు ప్రభుత్వం నెలకు రూ.3వేల జీతం ఇస్తుంది. 1960ల్లో యూపీ అధికారిక తలారిగా అహ్మదుల్లా అనే వ్యక్తి పని చేసారు. ఆయన ఇప్పుడు ఆ పని చేయడంలో తలారి వృతి క్రూరమైనదని అందుకే

తాను ఆ వృత్తిని వదిలేసా అని చెప్పారు. 1965 సమయంలో ఒక్క ఉరిశిక్షకు తనకు కేవలం రూ.25 చెల్లించేవారట. 26/11 ముంబై పేలుళ్ల దోషి, పాకిస్తాన్ టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌ను బాబు అనే తలారిని ఉరి తీయగా అతనికి అప్పుడు 5 వేలు ఇచ్చారు అధికారులు. టెర్రరిస్ట్ యాకుబ్ మెమన్‌ను కూడా అతనే ఉరి తీసారు. అయితే వీరి వివరాలను వారి వ్యక్తిగత భద్రత దృష్ట్యా అధికారులు బయటపెట్టలేదు.

Read more RELATED
Recommended to you

Latest news