బావిలో పడ్డ కొబ్బరిబోండాల కోసం దిగిన రైతు.. అక్కడ అది చూసి భయంతో పరుగులు

-

ఒక్కోసారి మనకు తెలియకుండానే పెద్దపెద్ద గండాలనుంచి బయటపడతాం. తృటిలో తప్పిన ప్రమాదం అంటుంటారు కదా అలాంటిదే ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కొబ్బరి బొండాల కోసం బావిలోకి దిగితే ఊహించనవి కనిపించి అంతా షాక్ తిన్నారు.. అంతే కాదు పెను ప్రమాదం తప్పింది కూడా.. ఇప్పటికే వారు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.

ఏం జరిగిందంటే..

ప్రతి ఏడాదిలానే ఈ సారి అక్కడ కొబ్బరి పంట బాగా వచ్చింది..వాటిని కిందకు దించేందుకు ఓ కొబ్బరి రైతు సిద్దమయ్యాడు. వెంటనే కొబ్బరి చెట్టుపైకి ఎక్కి.. అక్కడ ఉన్న కొబ్బరి బొండాలను ఒక్కొక్కటిగా కిందకు దించుతున్నాడు. అదే సమయంలో కొన్ని కొబ్బరి బొండాలు అనుకోకుండా.. పక్కనే ఉన్న పాడుపడ్డ బావిలో పడిపోయాయి..అయితే ప్రతి ఏడాది అలానే జరుగుతుంటూ ఉంటాయి. అలా పడిపోయిన కొబ్బరి బొండాలను బావిలోకి దిగి తీయటం కూడా వారికి అలవాటే. అదే అలావాటులో బావిలోకి దిగితే ఈ సారి ఊహించని షాక్ తగిలింది..

కింద పడిపోయిన బొండాలను వదిలేస్తే కొంత నష్టం వస్తుందని.. అయినా కష్టపడి కొట్టిన బొండాలను అలా వదిలిస్తే ఎలా అంటూ.. వాటిని తీసేందుకు బావిలోకి దిగాడు ఆ రైతు.. కొన్ని బొండాలు తీస్తుండగా ఏదో శబ్దాలు అతన్ని భయపెట్టాయి. ఏంటి ఆ శబ్ధం అని చూస్తుండగా..5 అడుగుల అత్యంత విషపూరితమైన రక్త పింజరి బయటపడింది. బుసలు కొడుతున్న పామును చూసి కొబ్బరి రైతులు అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. భయంతో తోట నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు.

వర్మ ఆ పామును చాకచక్యంగా బంధించాడు. అది గర్భంతో ఉందని..పాము పొట్టలో 60 నుండి 100 పిల్లలు ఉండి ఉంటాయని స్నేక్ క్యాచర్ వర్మ పేర్కొన్నాడు. ఆపై నిర్మానుష్య ప్రదేశంలో పామును వదిలిపెట్టారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అక్కడ రక్తపింజరాలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొదలు, పుట్టలు కొట్టుకు పోవటంతో పాములు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే కొబ్బరి కాయలు దింపుతున్న రైతుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకోరకంగా చూస్తే..ఆ పామును ఒకవేళ గుర్తించకపోతే..అది అన్ని పిల్లలను పెట్టి మొత్తం ఆ తోట అంతా పాముల మయం అయ్యేది. వాటిని ఒకేసారి పట్టుకోవటం కూడా కష్టసాధ్యం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news