క్రిస్టియానో రొనాల్డో – కోకా కోలా వివాదంపై ఫెవికాల్ ప్యార‌డీ యాడ్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

దిగ్గ‌జ ఫుట్‌బాల్ ఆట‌గాడు క్రిస్టియానో రొనాల్డో ఇటీవ‌ల సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఓ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో రెండు కోకా కోలా బాటిల్స్‌ను చూపిస్తూ వాటిని తాగ‌వద్ద‌ని, ఆరోగ్యానికి హానిక‌రం అన్నాడు. దీంతో కోకా కోలా షేర్ల ధ‌ర‌లు ప‌డిపోయాయి. 56.10 డాల‌ర్లు ఉన్న షేర్ ధర 55.22 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. కోకా కోలాకు బిలియ‌న్ డాల‌ర్ల మేర న‌ష్టం సంభ‌వించింది. అయితే పుండు మీద కారం చ‌ల్లినట్లుగా ఆ సంఘ‌ట‌న‌ను మ‌రోసారు గుర్తు చేస్తూ అధెసివ్ కంపెనీ ఫెవికాల్ ఓ యాడ్ ను ప్ర‌సారం చేస్తోంది.

క్రిస్టియానో రొనాల్డో ఘ‌ట‌నను గుర్తుకు తెచ్చేలా ఫెవికాల్ ఓ యాడ్‌ను రూపొందించింది. అందులో రెండు ఫెవికాల్ డ‌బ్బాలు టేబుల్ మీద ఉంటాయి. వాటిని చూపిస్తూ ఫెవికాల్ ఓ కాప్ష‌న్‌ను కూడా పెట్టింది. Na bottle hategi, na valuation ghategi.. అంటే బాటిల్స్ ను క‌దిలించ‌లేరు, దాని విలువ కూడా ప‌డిపోదు. అని కాప్ష‌న్ పెట్టింది. అలాగే Haye ni mera Coka Coka Coka Coka Coka అంటూ ట్విట్ట‌ర్ పోస్టు పెట్టింది. దీంతో ఆ పోస్టు వైర‌ల్‌గా మారింది.

కోకా కోలా ఉదంతానికి ప్యార‌డీగా ఫెవికాల్ ప్ర‌సారం చేస్తున్న ఆ యాడ్ ఎంతో మంది నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. నెటిజ‌న్లు చాలా మంది ఫెవికాల్ క్రియేటివిటీని ప్ర‌శంసిస్తున్నారు. స‌రైన స‌మ‌యంలో స‌రైన బిజినెస్ జిమ్మిక్కు.. అని కొంద‌రు కామెంట్ చేయ‌గా.. ప‌బ్లిసిటీ బాగానే చేస్తున్నారు, ప‌బ్లిసిటీ స్టంట్ ఇది.. అని ఇంకొంద‌రు కామెంట్లు చేశారు. కాగా కోకా కోలా ప్ర‌స్తుతం దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కోకా కోలాకు వ్యంగ్యంగా ఫెవికాల్ ఆ యాడ్‌ను ప్ర‌సారం చేస్తుండ‌డం నెటిజ‌న్ల‌కు వినోదాన్ని అందిస్తోంది.