అక్కడ పొరుగు దేశం నుంచి అమ్మాయిలను కొని కోరికలు తీర్చుకుంటున్న అబ్బాయిలు

-

నేడు పురుషులకు తగిన స్త్రీలు లేరు. ఈ సమస్య అన్ని దేశాల్లో ఉంది. కానీ ఆ దేశంలో మరీ ఎక్కువగా ఉంది. పెళ్లికూతుర్లు దొరకడం లేదని వారు ఎంతటి దారుణాలకు తెరలేపారో, ఆడపిల్లల పట్ల ఎంత అమానుషంగా ప్రవరిస్తున్నారో తెలిస్తే.. ఆ దేశంలో అడుగుపెట్టాలంటేనే ఆడపిల్ల భయపడుతుంది. ఇంతకీ ఆ దేశం ఏదో కాదు.. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనానే. చైనాలో ఎన్నో ఏళ్లుగా బాలికల అక్రమ రవాణా కొనసాగుతోంది. చైనాలో ఆడపిల్లలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పురుషులతో పోలిస్తే చైనాలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం చైనా నిబంధనలే. మన దేశంలాగే మన పొరుగుదేశం జనాభా పెరిగింది. జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం ఒకే బిడ్డ విధానాన్ని అమలులోకి తెచ్చింది. చాలా ఏళ్లుగా ప్రజలు ఒకే బిడ్డ విధానాన్ని అనుసరిస్తున్నారు.

చైనీస్ ప్రజలు అమ్మాయిల కంటే అబ్బాయిలను కనడానికే ఎక్కువ ఇష్టపడ్డారు. దాంతో ఆడపిల్ల అని తెలియగానే చంపేశారు. దీంతో చైనాలో అమ్మాయిల సంఖ్య తక్కువగానే ఉంది. ఇప్పుడు అక్కడి ప్రజలకు పెళ్లి చేసేందుకు పెళ్లికూతురు దొరకడం లేదు. దాంతో పొరుగు దేశాల నుంచి అమ్మాయిలను కొనుగోలు చేసే వ్యాపారం ప్రారంభించారు. చైనాలో మహిళల అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది.

ఈ వ్యాపారం కింద రూ.25 వేలకు పైగా చెల్లించి అమ్మాయిని కొనుగోలు చేస్తారు. పెళ్లికి పెళ్లికూతురు లేని కారణంగానే డబ్బులిచ్చి అమ్మాయిలను కొంటున్నారు ఇందులో తప్పేం ఉంది అనుకుంటున్నారేమో..అమ్మాయిలను కొనుగోలు చేసే చైనీయులు తమ వ్యసనాన్ని తీర్చుకోవడానికి ఆమెను ఉపయోగించుకుంటారు. ఒక్కరు కొనుగోలు చేసి వారి స్నేహితులంతా ఆమెపై అత్యాచారం చేస్తారు. చైనాలో ఆండ్రీ అనే వ్యక్తి ఒక అమ్మాయిని కొనుగోలు చేశాడు, వాళ్ల స్నేహితులంతా ఆమెపై అత్యాచారం చేశారు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. ఆ బాలిక చనిపోయే వరకు అత్యాచారానికి గురైంది.

చైనా అబ్బాయిలు విదేశాల నుంచి పేద కుటుంబాల అమ్మాయిలను కొనుగోలు చేస్తారు. ఉత్తర కొరియాకు చెందిన యెన్మీ పార్క్ అనే మహిళ ఈ చేదు నిజాన్ని వెల్లడించింది. యెన్మీని ఎవరూ బలవంతంగా చైనాకు తీసుకెళ్లలేదు. మెరుగైన, ప్రశాంతమైన జీవితాన్ని వెతుక్కుంటూ ఉత్తర కొరియా నుంచి చైనాకు పారిపోయానని యెన్మీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఉత్తర కొరియాలో నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉక్కిరిబిక్కిరైన యెన్మీ చైనాకు వెళ్లారు. కానీ చైనాలో జీవితం మరింత నరకం అని యెన్మీ చెప్పారు.

ఉత్తర కొరియాలో కంటే చైనాలో జీవితం మెరుగ్గా ఉండాలని యెన్మీ కోరుకున్నారు. కానీ అక్కడ ఆమె మానవ అక్రమ రవాణాకు బలైపోయింది. యెన్మీ జీవితమే కాదు తన తల్లి జీవితం కూడా నాశనం అయిందని యెన్మీ చెప్పింది.

యెన్మీ తల్లి మరియు యెన్మిని బ్రోకర్లు కొనుగోలు చేశారు. యెన్మీ 8500 రూపాయలకు, తన తల్లిని 25,000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఆపై వారి మీద చాలా మంది మూకుమ్మడిగా అత్యాచారం చేసినట్లు ఆమె తెలిపింది. చైనాలో ఒక బిడ్డ విధానం కారణంగా 4 లక్షల మంది పురుషులకు మహిళలు లేరు. ఈ కారణంగానే ఆడపిల్లలను కొంటున్నారని యెన్మీ తెలిపింది. ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news