బొద్దింక ఉందంటే పొగరుగా సమాధానం చెప్పారు, ఫైన్ ఎంత వేసారో తెలిస్తే…!వెంటనే విమానంలో ఉండే సిబ్బందికి ఫిర్యాదు చేసారు. వెంటనే శుభ్రపరచాలని కోరారు. కాని అందుకు సిబ్బంది నో సర్ అని చెప్పడమే కాకుండా,కంప్లైంట్ చేసుకోండి అని సలహా కూడా ఒకటి ఇచ్చేసారు. దీనితో ప్రయాణికులు ఇద్దరూ, దిగిన అనంతరం విమానయాన సంస్థపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఆ బొద్దింక ఉన్న ఫొటోను కూడా ఇండిగో అధికారులు ముందు పెట్టారు. సీటు కింద బొద్దింక ఉండటం పెద్ద నేరం కాదని వాళ్ళు సమాధానం ఇవ్వడంతో ఒళ్ళు మండిపోయి, కోర్ట్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
అనుకున్నదే తడవుగా బాధితులు ఇద్దరూ, పుణె జిల్లా వినియోగదారుల న్యాయస్థానానికి ఫిర్యాదు చేయగా కోర్టు పలు మార్లు నోటీసులు పంపించినా ఇండిగో అధికారులు వెళ్ళలేదు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్, ప్రయాణికులకు టికెట్ ఛార్జీ(రూ.8574)లను తొమ్మిది శాతం వడ్డీతో తిరిగి ఇవ్వడంతో పాటుగా నష్టపరిహారంగా రూ.50,000 చెల్లించాలని ఇండిగో సంస్థను ఆదేశించింది.