వింతల్లో వింత… మనిషి ముఖంతో పుట్టిన ఆవుదూడ …!!! వైర‌ల్ వీడియో

915

ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కొన్ని వింతలు నోళ్ళు వెళ్ళబెట్టేలా ఉంటే మరికొన్ని భయాన్ని కలిగించేలా ఉంటాయి. అయితే కాలజ్ఞానంలో బ్రహ్మగారు చెప్పినట్టుగా అనేక చోట్ల ఎన్నో వింతలు జరిగాయికూడా. కొన్ని కొన్ని వింతల వెనుక శాస్త్రీయ పరమైన అంశాలు కలిసి ఉంటాయి. తాజాగా జరిగిన ఓ వింత అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ఆవు జన్మనిచ్చిన దూడ మనిషి ముఖంతో పోలి ఉండటం ఇప్పుడు అతిపెద్ద చర్చకి దారి తీసింది.

అర్జెంటీనా లో విల్లా అనే గ్రామంలో ఓ ఆవు మనిషి ముఖంతో ఉన్న ఆవు దూడకి జన్మని ఇచ్చింది. దాంతో ఆ నోటా ఈ నోటా తెలిసి చుట్టుపక్కలవారందరూ తండోప తండాలుగా తరలి వస్తున్నారు. అక్కడికి వచ్చిన వారిలో చాలామంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త ప్రపంచ వ్యాప్తంగా తెలిసి వైరల్ అయ్యింది.

పుట్టిన ఈ ఆవుదూడకి మనిషికి పోలినట్టుగా చిన్న ముక్కు , చెవులు, తల ఉండటం విశేషం. అయితే ఈ విషయంపై పరిశోధించిన నిపుణుడు నికోలస్ మీడియాతో మాట్లాడుతూ జన్యుపరమైన మార్పుల వలన ఈ దూడ పుట్టిందని, డీఎన్ఏ లలో మార్పుల వలనకూడా ఇలాంటి పరిణామాలు జరుగుతాయని అన్నారు. అయితే గర్భంలో ఉన్న సమయంలో పుర్రె సరిగా ఎదగక పోవడంవలన మనిషిని పోలినట్టుగా ఉందని ఆయన అన్నారు. అయితే ఇది పుట్టిన కొద్ది సేపటికే చనిపోయిందని ఆవు యజమాని తెలిపారు.