సంచలనం; చేపలు పట్టే పడవలో 175 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం…!

-

గుజరాత్ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో పాకిస్తానీయులు భారత్‌లోకి దిగమతి చేసేందుకు తీసుకొచ్చిన రూ. 175 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ డీజీపీ శివానంద ఝా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని కచ్ తీరంలో,

చేపలు పట్టే పడవలో రూ. 175 కోట్ల విలువైన హెరాయిన్‌ చేరవేస్తున్నారనే సమాచారం అందుకున్న అధికారులు, సమన్వయంతో దాడులు చేయగా వారి వద్ద పడవలో నుంచి 35 ప్యాకెట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్పందించిన గుజరాత్ పోలీసులు, డ్రగ్స్ విలువ కనీసం రూ. 175 కోట్లు ఉంటుందన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై విచారణలో తేలుస్తామని పోలీసులు పేర్కొన్నారు.

అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టే౦దుకు గాను వారిని ప్రత్యేక విభాగం విచారణ చేస్తుంది. అరెస్టయిన పాకిస్తానీలను కరాచీ వాసులుగా అధికారులు గుర్తించారు. అనీస్‌ ఇసా భట్టి (30), ఇస్మాయిల్‌ మహ్మద్‌ కచ్చి (50), అష్రాఫ్‌ ఉస్మాన్‌ కుట్చి (42), కరీం అబ్దుల్లా కుట్చి (37), అబుబకర్‌ ఆష్రఫ్‌ సుమ్రాలు (55)గా గుర్తించారు. 1,600 కి.మీ. సుదూర గుజరాత్ తీర ప్రాంతాన్ని ఎల్లవేళలా డేగకన్నుతో కాపలా కాసున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news