ఒకే కుటుంబం.. ఒకేసారి 17 మందికి పెళ్లి..!

-

సాధారణంగా పెళ్లి అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయాలంటే ఇంటి వారితో పాటు కొంత మంది బంధువుల సహాయం కూడా అవసరం. పెళ్లి పత్రికల వద్ద నుంచి వివాహం జరిగేంత వరకు బంధు, మిత్రుల సహాయం లేకుండా పెళ్లి చేయలేరు. అలాంటిది ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన 17 మంది పెళ్లిళ్లు జరపడం అంటే మామూలు విషయం కాదు.

రాజస్థాన్ లో ఒకేసారి 17 పెళ్లిళ్లు జరిపించాడు సూర్జారమ్ గోదారా అనే వ్యక్తి. తన ఇంట్లో 17 మంది మనవలు, మనవరాళ్లకు ఒకేసారి పెళ్లి చేయాలని భావించాడు. ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లి వేడుకను నిర్వహించాలనుకున్నారు. పెళ్లికి ఒకే ఒక పత్రికను ముద్రించి బంధు, మిత్రులకు అందజేశారు. రాజస్థాన్ లోని బికనీర్ జిల్లా నోఖా మండలంలోని లామ్ దేసర్ గ్రామానికి చెందిన సూర్జారామ్ గోదారాకు ఐదుగురు మనవలు, 12 మంది మనవరాళ్లు పెళ్లీడుకు వచ్చిన వారు ఉన్నారు. ఏప్రిల్ 01న వీరి పెళ్లి జరిగింది. మనవళ్లకు ఒకరోజు, మనవరాళ్లకు మరుసటి రోజు పెళ్లి ముహూర్తాలుగా నిర్ణయించారు. రెండు రోజుల పాటు ఇంటి పెళ్లి సందడి జరిగింది. ఈ పెళ్లి వేడుకను చూసేందుకు బంధువులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news