60 సెకన్లలో 273 వాల్‌నట్స్‌ నుదిటితో పగలగొట్టి పాకిస్తానీ రికార్డ్‌ను తిరగరాసిన దేశీవాలా

-

వాల్‌నట్స్‌ షల్‌తో ఉండేవి పగలగొట్టాలంటే చాలా కష్టం. అందుకే ఎవరూ షల్‌తో ఉండేవి తీసుకోరు. అవి తీసేసి విక్రయిస్తుంటారు. వాటిని తీసుకుంటే.. హ్యాపీగా తినేయొచ్చు. ఓ వ్యక్తి కేవలం ఒకే ఒక నిమిషంలో 273 వాల్‌నట్స్‌ను పగలగొట్టాడు తెలుసా..? రికార్డులు బ్రేక్‌ చేసిన ఈ వ్యక్తి మన దేశ పౌరుడే కావడం ఇంకా విశేషం. ఇంకా హైలెట్‌ ఏంటంటే.. అతను వాటిని పగలగొట్టింది చేత్తోనే, సుత్తితోనే కాదు.. నుదిటితో.! ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది..!

మన దేశానికి చెందిన నవీన్‌. గతంలో పాక్‌కు చెందిన వ్యక్తి పేరిట ఉన్న రికార్డును చెరిపేసి గిన్నిస్‌ బుక్‌ రికార్డును సాధించాడు. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్‌ రషీద్‌ గతంలో నిమిషంలో 254 వాల్‌నట్స్‌ను నుదుటితో పగులగొట్టి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించాడు. తాజాగా మన దేశానికి చెందిన ఎస్‌ నవీన్‌ కుమార్‌ ఆ రికార్డును తిరగరాశాడు. వరుసగా టేబుళ్లపై ఉంచిన 273 వాల్‌నట్స్‌ను కేవలం 60 సెకన్లలో పగులగొట్టి కొత్త రికార్డును సృష్టించాడు. ఈ విషయంలో 2017 నుంచి శిక్షణ తీసుకుంటున్నాడట. గతంలో ఇటలీలో ఒకే వేదికపైగా రషీద్‌తో నవీన్‌ తలపడ్డాడు. అప్పుడు 239 వాల్‌నట్స్‌ మాత్రమే పగులగొట్టగలిగాడు. దీంతో వెనకబడిపోయాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత రషీద్‌ పేరిట ఉన్న రికార్డును నవీన్‌ తిరగరాశాడు. దీనికి సంబంధించిన వీడియో గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్స్‌ తన ట్విటర్‌ పేజీలో తాజాగా పంచుకుంది.

ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు ఇవి కాదు నైజీరియన్‌ వాల్‌నట్స్‌ను పెడితే తెలిసేది అంటున్నారు. ఇంకొందరు అయితే అతని ఫోర్‌హెడ్‌ పరిస్థితి ఏంటో అని కమెంట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 62. 1k వ్యూస్‌ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news