అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 25వేల కోట్లతో 508 రైల్వే స్టేషన్ల ఆధునికరణ పనులను వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా 26 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్ కి దమ్ముంటే మంత్రి కేటీఆర్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. రూ.15,000 – 20,000 కోట్ల ఆర్టీసీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని.. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని గవర్నర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.