స్కూటీని ఇలా డ్రైవ్ చేయాలని మీకు తెలుసా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందంతే…!

-

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ వీడియో అయితే చాలు దానికి ఈజీగా పబ్లిసిటీ వచ్చేస్తుంది. నెటిజన్లు దాన్ని చూడటం మాత్రమే కాకుండా ప్రమోట్ చేసి నెట్టింట ట్రెండయ్యేలా చేస్తారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూస్తే ఫన్నీగా అనిపించడం మాత్రమే కాదు.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందట.. ఇంతకీ సదరు వీడియోలో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీని పూర్తిగా చదివి తెలుసుకోండి మరి..

సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన స్కూటీ మీద చాలా పెద్ద లోడ్‌ను తీసుకెళ్తున్నాడు. ఆ ఫొటోను చూసినా లేదా వీడియోను చూసినా మీరు నవ్వు ఆపుకోలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సదరు వీడియోను చూసి నెటిజనాలు స్కూటీ నడుపుతున్న అతడిని ‘భారీ డ్రైవర్’ అని కామెంట్ చేస్తున్నారు. డ్రైవింగ్ ఎలా చేయాలో? డ్రైవర్లందరూ ఈయన్ను చూసి నేర్చుకోవాలని పోస్టులు పెడుతున్నారు. చాలా మంది ఈ వీడియో చూసి ఆశ్చర్యపడుతున్నారు. వీడియోలో సదరు వ్యక్తి హైవేలో స్కూటీ నడుపుతున్న విధానం చూసి సూపర్ మ్యాన్ అని పొగిడేస్తున్నారు. అయితే అలాంటి స్టంట్ చేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్పత్రి పాలవడమే కాదు..ప్రాణాలు పోయే చాన్సెస్ ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ట్రాఫిక్ వాళ్లు ఇతడిని చూసినా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించావంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం గ్యారంటీ అని అంటున్నారు. స్కూటీ నడుపుతున్న వ్యక్తి మాయగాడిలా ఉన్నాడంటూ కొందరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియో కొంటె చాచాజీ అనే ఇన్ స్టా అకౌంట్ నుంచి తొలి సారి షేర్ కాగా అక్కడ నుంచి నెట్టింట సందడి చేయడం షురూ చేసింది. అద్భుతమైన మాయగాడి డ్రైవింగ్ చూడండోయ్ అంటూ పలువురు వీడియోను ఇంకా షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news