ఈ భూమి మీద నివసించే జీవుల్లో మనిషి కంటే చిత్రమైన మరే ప్రాణి లేదని చెప్పవచ్చూ.. అతనికి ఉన్న పరిజ్ఞానంతో వింతలు విచిత్రాలు చేస్తాడు. అంతే విద్వంసాలు సృష్టిస్తాడు..ఒక్కోసారి తాను చేసే పనుల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు.. ఇక ఒక రకంగా మనషుల మానసిక రుగ్మతకు, వింత ప్రవర్తనలకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక వ్యక్తి చేసిన పని.. దీని గురించి తెలుసుకుంటే షాకవడం ఖాయం..
అదేంటంటే అసోంకు చెందిన 30 సంవత్సరాల ఒక వ్యక్తికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో హస్పిటల్‌కు వెళ్లాడట.. అక్కడ ఇతన్ని పరీక్షించే వైద్యులకు తాను పొరపాటున హెడ్‌ఫోన్ కేబుల్‌ను మింగేశానని చెప్పాడు. ఆ మాటవిన్న వైద్యులు షాక్ అయ్యారట.. వెంటనే మల పరీక్ష, ఎండోస్కోప్ చేసిన ఫలితం లేకపోవడంతో, శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించి, అతన్ని మరోమారు పరిశీలించగా, ఆ కేబుల్ ఆచూకి జీర్ణాశయంలో కూడా దొరకలేదట. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఆపరేషన్ బెడ్ మీదే ఎక్స్ రే పరీక్ష నిర్వహించి, రోగి మూత్రాశయం లోపల దాదాపు రెండు అడుగుల పొడవైన కేబుల్‌ను గుర్తించారు.
ఇకపోతే అతడు వైద్యులకు అబద్దం చెప్పాడనీ నోటి ద్వారా కాకుండా పురుషాంగం ద్వారా కేబుల్ చొప్పించబడిందని సర్జన్ డాక్టర్ వాలియుల్ ఇస్లాం వెల్లడించారు.. వీడిపిచ్చి తగిలెయ్యా.. మరీ ఇంత కక్కూర్తి ఏంటో అర్ధం కావడంలేదు.. ఇకపోతే ఇతడు చేసిన పనిని యురేత్రల్ సౌండింగ్ అని పిలిచే ఒక రకమైన హస్త ప్రయోగమని, ఇది చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. చూశారా మనుషులు వింత జీవులనడానికి ఈ సంఘటన సరిపోయింది..