ఇదేం విడ్డూరం.. వధువును అత్తారింటికి అలా సాగనంపాలట..

-

సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికి తెలుసు..మనుషుల అవసరం లేకుండానే పనులు అవుతున్నాయి.. కానీ, కొన్ని ప్రాంతాలలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. ప్రజలు వాటిని ఇప్పటికీ నమ్ముతున్నారు..పెళ్ళి సమయంలో మరీ ఎక్కువ..పెళ్లి సందర్భంలో చాలా ప్రాంతాల్లో వధువు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తుంది..

 

అయితే వితంతువు వేషధారణలో వధువుకు వీడ్కోలు పలికే గ్రామం మన దేశంలో ఒకటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు.తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎరుపురంగు పెళ్లి దుస్తులకు బదులు తెల్లటి దుస్తులలో అత్తారింటికి సాగనంపుతారు. ఈ విచిత్రమైన సంప్రదాయం పాటించే గ్రామం మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఉంది.భామ్‌డోంగ్రి గ్రామంలో గిరిజన సమాజానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ కూతురి పెళ్లయ్యాక తల్లిదండ్రులు ఆమెకు వితంతువు దుస్తులు ధరింపజేసి అత్తారింటికి పంపిస్తారు. అంతేకాదు పెళ్లికి హాజరయ్యే వారంతా కూడా తెల్లని దుస్తుల్లోనే కనిపిస్తారు. ఇక్కడి ప్రజలు గోండి ఆచారాన్ని అనుసరిస్తారు. వారి నమ్మకం ప్రకారం తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది..

తెలుపు రంగు శాంతిని చూసిస్తుంది..అందుకే వాళ్ళు ఈ రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తారు.పెళ్లి సమయంలో వధూవరులు ఏడు ప్రదక్షిణలు చేస్తారు. కానీ వీరి ఆచారంలో నాలుగు ప్రదక్షిణలు వధువు ఇంటి వద్ద, మిగిలిన మూడు ప్రదక్షిణలు వరుడి ఇంట్లో చేస్తారు…ఇంకో విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో మద్యం నిషేధం.. మత్తు పదార్థాలు ఏవి కూడా అక్కడ ఉండవట..

Read more RELATED
Recommended to you

Latest news